Pawan Kalyan : ఎవరికీ సాధ్యం కాని రికార్డ్.. స్టార్ హీరోల రికార్డ్ ని బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుస ప్రాజెక్ట్ లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

సినిమాలో షూటింగ్లో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు రాజకీయాలలో కూడా పాల్గొంటూ ఉన్నాడు.అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.

"""/" / పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు.ఈ సినిమాకు క్రిష్( Krish ) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తోంది.

ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ ( Harish Shankar )దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదయ సీతం తెలుగు రీమేక్ వెర్షన్ లోని తన భాగాన్ని పూర్తి చేశారు.

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

"""/" / కాగా ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోర్షన్ ను తాజాగా పూర్తి చేసుకున్నారు.

కేవలం 24 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు.ఈ మధ్యకాలంలో ఇంత షార్ట్ టైంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమాను పూర్తి చేయలేదు.

రోజూ ఉదయాన్నే షూటింగ్ కు వెళ్లి రాత్రి వరకూ చేసి 24 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు.

ఒకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూనే మరోవైపు సినిమాలు చూసుకుంటూ అంతి తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఏ స్టార్ హీరోకి సాధ్యం కానీ ఈ రికార్డును పవన్ కళ్యాణ్ చేసి నిరూపించి అరుదైన రికార్డును సొంతంచేసుకున్నారు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అది కదా పవర్ స్టార్ అంటే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.

జి.విశ్వప్రసాద్( T.

G.Vishwaprasad ) నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 28న విడుదల కానుంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి మొదలుకానుంది.