తొలిప్రేమ రెమ్యూనరేషన్ తో పవన్ అలాంటి పని చేశారా… ఏమైందంటే?
TeluguStop.com
చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) .
ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు.ఇలా హీరోగా మంచి ఆదరణ సొంతం చేసుకున్న పవన్ రాజకీయాలలోకి అడుగు పెట్టారు.
జనసేన( Janasena ) పార్టీని స్థాపించిన ఈయన ఎన్నో అవమానాలను అడ్డంకులను ఎదుర్కొంటూ నేడు రాజకీయాలలో కూడా తన స్టామినా ఏంటో చూపించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం( AP Deputy CM ) హోదాలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
"""/" /
ఇలా రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు అలాగే ముందుగా కమిట్ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఇకపోతే ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ముఖ్యంగా ఈయన నటించిన తొలిప్రేమ( Tholi Prema ) సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నేను తొలిప్రేమ సినిమా చేసినందుకు గాను నాకు 15 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని పవన్ తెలిపారు.
"""/" /
ఇలా ఈ సినిమా రెమ్యూనరేషన్ అందుకున్న తర్వాత ఒక బుక్ స్టాల్ వెళ్లాను అయితే అక్కడ ఉన్నటువంటి పుస్తకాలు( Books ) చూసి నాకు చాలా ఆనందం వేసింది.
ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉందని భావించి నాకెంతో ఇష్టమైన పుస్తకాన్నింటినీ కొనుగోలు చేశాను అలా ఆ రెమ్యూనరేషన్ తో సుమారు లక్షన్నర వరకు పుస్తకాలు కొనుక్కొని నా గదిలో నీటిగా అలంకరించాలని తెలిపారు.
ఇలా నా ఎదురుగా నాకు నచ్చిన పుస్తకాలు ఉండటంతో వాటన్నింటిని చూస్తూ ఆ పుస్తకాలను చదువుతూ మూడు రోజుల పాటు నిద్ర లేకుండా సంతోషంగా గడిపాను.
అలా నేను తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతో నాకెంతో ఇష్టమైన పుస్తకాలు కొన్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్లు కొట్టబోతున్నారా..?