ఆగస్టు 15న వరల్డ్ రికార్డ్‌కు సన్నాహాలు చేస్తున్న పవన్ ఫ్యాన్స్
TeluguStop.com
ఒకప్పుడు హీరోల బర్త్ డే లు అంటే వారి వారి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించే వారు.
కేక్ లు కట్ చేసి, రక్త దానాలు చేస్తూ, ఆసుపత్రుల్లో తిరిగి పండ్లు పంచి పెట్టి, ప్లెక్సీలతో నింపేసేవారు.
కాని ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది.సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడమే బర్త్‌డే వేడుక అన్నట్లుగా మారింది.
కోట్లాది ట్వీట్స్‌ను వారి అభిమాన హీరోల పుట్టిన రోజున చేస్తూ అభిమానులు ఆనందం పొందుతున్నారు.
ఇప్పుడు తెలుగు హీరోల ఫ్యాన్స్ ఆల్ ఇండియా రికార్డ్ ను సైతం ఇందులో దక్కించుకున్నారు.
ఈ ట్వీట్స్ రికార్డ్ ఎన్టీఆర్ బర్త్‌డే తో ప్రారంభం అయ్యింది.ఎన్టీఆర్ బర్త్‌డేకు రెండు కోట్లకు పైగా ట్వీట్స్‌ను ఆయన అభిమానులు చేశారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే హ్యాష్ ట్యాగ్‌తో 2.
8 కోట్ల ట్వీట్స్ చేశారు.పవన్ ఫ్యాన్స్ రికార్డు కొన్ని రోజులు కూడా నిలవకుండా అప్పుడే దాన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ 3.
1 కోట్ల ట్వీట్స్ తో బ్రేక్ చేశారు.మహేష్ బాబు బర్త్‌డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్ కు 24 గంటల్లో 3.
1 కోట్ల ట్వీట్స్ నమోదు అవ్వడం ఆల్ ఇండియా రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు. """/"/
మహేష్ బాబు ఫ్యాన్స్ సాధించిన ఆల్ ఇండియా రికార్డ్‌ను పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నారు.
సెప్టెంబర్ లో పవన్ బర్త్‌డే ఉంది.అందుకు సన్నాహకంగా ఆగస్టు 15వ తారీకున పవన్ బర్త్‌డే కామన్ డీపీ విడుదల చేయబోతున్నారు.
ఆ రోజు కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్ ను 3.8 కోట్ల ట్వీట్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ అందరికి ట్రెండ్ అలర్ట్ వెళ్లింది.24 గంటల్లో పవన్ ఫ్యాన్స్ 3.
8 కోట్ల ట్వీట్స్‌ను చేస్తే ప్రపంచ రికార్డ్‌గా చెప్పుకుంటున్నారు.పవన్ ఫ్యాన్స్ తల్చుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది.
ఆగస్టు 15న ఉదయం నుండి ఈ రికార్డ్ మారథాన్ ప్రారంభం కాబోతుంది.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు..!!