పవన్ బర్త్ డే ….ను కవర్ చేయని జాతీయ మీడియా పై ఫైర్ అయిన అన్షుల్ సక్సేనా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన తన నటనా, స్టైల్, వ్యక్తిత్వం తో ఎంతమంది ఫ్యాన్స్ ను సంపాదించారు.

తాజాగా ఈయన పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

కొంతమంది విదేశాలలో ఉండే పవన్ ఫ్యాన్స్ అయితే ఏకంగా పాకిస్తాన్ గవర్నమెంట్ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి అందులో పవన్ ఫోటో డిస్ ప్లే అయ్యేలా చేసి పవన్ నటించిన ఖుషి సినిమాలోని హే మేర జహా సాంగ్ బ్యాక్ రౌండ్ లో ప్లే చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అందులో అందరి దృష్టిని బాగా ఆకర్షించిన అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 ఆక్సిజన్ సిలిండర్లను పవన్ ఫ్యాన్స్ పంపిణీ చేశారు.

ఇలాంటి గొప్ప విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కాకుండా సోషల్ మీడియా ద్వారా తెలియడం బాధాకరమని ఇలాంటి విషయాలను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని? ప్రముఖ హ్యాకర్ అన్షుల్ సక్సేనా సోషల్ మీడియా ద్వారా జాతీయ మీడియా సంస్థలను ప్రశ్నించారు.

రూ.10 విషయంలో ఆటోడ్రైవర్‌ను చితకబాదిన ట్రాన్స్‌జెండర్ ఉమెన్.. వీడియో వైరల్..