పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, చిరంజీవి గాడ్ ఫాదర్.. ఆ ఇండస్ట్రీని లేపడానికే సినిమాలు తీస్తున్నారంటూ?

మాములుగా సినిమా అంటే ఒక కథ.ఇక ఈ కథను కథలా చెప్పకుండా అందులో కొన్ని రకాల నవరసాలతో, నటీనటులతో కలిసి రూపొందిస్తారు.

కథ అనేది ఎక్కడినుండో దొరకదు.కేవలం మనిషి ఆలోచనలో నుంచి కథ పుట్టి ఆ కథను అద్భుతంగా సృష్టించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే సినిమా.

ఇటువంటి సినిమాలు ఎన్నో భాషల్లో ఎన్నో రకాల కథలతో ఇప్పటివరకు లెక్కలేనంతగా తెరకెక్కాయి.

అయితే ఆ సినిమాలు కొన్ని కొన్ని సార్లు మంచి సక్సెస్ ను కూడా సొంతం చేసుకుంటాయి.

దీంతో ఈ సినిమాలను ఇతర భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు.ఇక ఈ మధ్య ఇతర భాషలకు చెందిన సినిమా కథలను కాపీ కొడుతున్నారు మన తెలుగు దర్శకులు.

ఇక తెలుగు సినిమాలను కూడా ఇతర భాషల దర్శకులు కూడా కాపీ కొడుతున్నారు.

ఇక వీటిని రీమేక్ అనే పేరుతో నటీనటులను మార్చి అచ్చం అదే కథతో రూపొందిస్తున్నారు.

దీంతో రీమేక్ సినిమాలలో దర్శకత్వం వహిస్తున్న దర్శకులకు ఇక్కడ ఎటువంటి టాలెంట్ అవసరం లేదు.

అక్కడి నుంచి మంచి హిట్ అయిన కథలను తెచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు.

నిజానికి అందులో కొత్తదనం ఏమీ ఉండదు.కానీ ఎక్కడి నుంచి అయితే సినిమాను రీమేక్ చేస్తారో ఆ ఇండస్ట్రీకి మరింత హైప్ పెరుగుతుంది.

"""/" / ఎందుకంటే ఆ సినిమాలు ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంటాయి కాబట్టి.

ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలే కాకుండా బాలీవుడ్, కోలివుడ్ నటులు కూడా రీమేక్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, బాలకృష్ణ, నితిన్ ఇలా పలువురు స్టార్ హీరోలే రీమేక్ సినిమాలకు అలవాటు పడుతున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమా రీమేక్ సినిమా అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

నితిన్ నటించిన మాస్ట్రో సినిమా కూడా రీమేక్ సినిమానే.చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

కేవలం ఈ సినిమాలే కాకుండా రాబోయే తమ సినిమాలు కూడా చాలా వరకు రీమేక్ సినిమాలని చెప్పవచ్చు.

"""/" / దీంతో అందరు స్టార్ హీరోలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రీమేక్ సినిమాలలో నటించడానికి వెనకాడటం లేదు.

అయితే ఇదంతా పక్కన పెడితే స్టార్ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల రీమేక్ లు మాత్రం మరింత సక్సెస్ కావడంతో.

అసలు భాష నుండి విడుదలైన సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపు వస్తుంది.ఎందుకంటే ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన అసలు సినిమా భాష మలయాళం.

మలయాళం సినిమాలలో కథలు చాలా బాగుంటాయి కాబట్టి ఈ భాష నుండి రీమేక్ చేయడానికి ఇష్టపడుతుంటారు స్టార్ హీరోలు.

ఇక ఆ భాష నుండి తీసుకున్న భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ మంచి సక్సెస్ కావడంతో అక్కడి ప్రేక్షకులు.

మొత్తానికి తమ మలయాళ ఇండస్ట్రీని లేపడానికే సినిమాలు తీస్తున్నారా అని కామెంట్లు పెడుతున్నారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!