భీమ్లా నాయక్ సంక్రాంతికి లేదు.. ఇదే సాక్ష్యం

ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌ నుండి ఆర్‌ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్ లు తప్పుకున్నాయి.

ఆ రెండు సినిమా ల వల్ల సంక్రాంతికి రావాలనుకున్న భీమ్లా నాయక్‌ మరియు సర్కారు వారి పాట మరి కొన్ని సినిమా లు కూడా తప్పుకున్నాయి.

ఇప్పుడు ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు రాధే శ్యామ్‌ లు తప్పుకోవడం వల్ల వాయిదా పడ్డ సినిమా లను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే సంక్రాంతి బరిలో బంగార్రాజు.హీరో.

ఇంకా రెండు మూడు సినిమాలు కూడా రాబోతున్నాయి.అందులో డీజే టిల్లు సినిమా కూడా ఉంది.

కాని భీమ్లా నాయక్‌ సినిమా విడుదల అవ్వబోతుందని కొందరు బలంగా నమ్ముతున్నారు.కాని మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వబోవడం లేదు.

ముందుగా చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరిలోనే భీమ్లా నాయక్ రాబోతున్నాడు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు భీమ్లా నాయక్ సినిమాను నిర్మించిన విషయం తెల్సిందే.

అదే బ్యానర్ లో రూపొందిన డీజే టిల్లు సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అంటే ఒకే బ్యానర్‌ లో రూపొందిన రెండు సినిమాలు ఒకే సారి అది కూడా బిగ్ సంక్రాంతి సీజన్ లో పోటీకి దించవు.

"""/"/ కనుక భీమ్లా నాయక్ ను తీసుకు వచ్చే ఉద్దేశ్యం సితార వారికి లేదు కనుకే డీజే టిల్లు ను వారు దింపబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

భీమ్లా నాయక్ సంక్రాంతికి రాదు అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదు అనేది కొందరి మాట.

సంక్రాంతికి పవన్ వస్తాడని ఎదురు చూసిన వారికి.ఆర్ ఆర్ ఆర్‌ వాయిదా పడ్డ వెంటనే భీమ్లా వస్తాడు అని సంతోషించిన వారికి ఇది కాస్త చేదు వార్త అనడంలో సందేహం లేదు.

కమల్ కు సాధ్యం కానిది సూర్య సాధిస్తారా.. కోలీవుడ్ కు పాన్ ఇండియా మూవీస్ కలిసొస్తాయా?