అభిమానుల ఒత్తిడితో వెనక్కు తగ్గిన 'భీమ్లా నాయక్‌' టీమ్‌?

మరో సారి పవన్ కళ్యాణ్‌ అభిమానులు సత్తా చాటారు.నిర్మాతలు మరియు బయ్యర్ల నిర్ణయాన్ని మార్చుకునేలా అభిమానులు చేశారు అనడంలో సందేహం లేదు.

పెద్ద ఎత్తున అభిమానులు భీమ్లా నాయక్ సినిమాను జనవరిలోనే విడుదల చేయాలనే డిమాండ్ చేశారు.

పెద్ద ఎత్తున సినిమా విడుదల విషయంలో జరిగిన చర్చలో అభిమానులు పూర్తిగా సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ముందు గా అనుకున్న ప్రకారమే విడుదల చేస్తే పోలే అనుకుని నిర్మాతలు కూడా తమ ఆలోచన ను మార్చుకున్నారనే సమాచార అందుతోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా వల్ల విడుదల వాయిదా వేయాలనుకున్న మేకర్స్ ఇప్పుడు వాయిదా వేస్తే వచ్చే సమ్మర్‌ వరకు మంచి డేట్‌ లేకపోవడంతో పాటు అభిమానులు జనవరిలోనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన విషయం తెల్సిందే.

"""/"/ ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రం షూటింగ్‌ ను ముగించే పనిలో ఉన్నారు.

ఒకటి రెండు వారాల్లో సినిమా విడుదల తేదీ పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

భీమ్లా నాయక్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో క్లీయర్ జోన్‌ లో విడుదల అయితే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్స్ కలెక్షన్స్ 50 కోట్లుగా నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్‌ కు సాగర్‌ చంద్ర దర్శకత్వం వహించాడు.

మరో వైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమా కు స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ను అందించాడు.

అద్బుతమైన ఈ సినిమా ను మలయాళం సూపర్ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ నుండి రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

నిత్యా మీనన్ ఈ సినిమా లో పవన్ కు జోడీగా నటించడం విశేషం.

పెద్ద ఎత్తున అంచనాలున్న భీమ్లా నాయక్ సినిమాను మరో రేంజ్‌ లో రెడీ చేసేందుకు పలువురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

విడుదల విషయంలో క్లారిటీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.

విశ్వనాథన్ భార్య చేసిన పనికి కార్ల్‌సన్ షాక్‌.. పొంగల్ వేడుకలో ఏం జరిగిందంటే?