మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించిన పవన్ మూవీ.. ఆంధ్రాలో పరిస్థితి అలా ఉందంటూ?
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైనా కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించింది.
మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు, 69 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించినట్టు సమాచారం.
ఓవర్సీస్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా నైజాంలో ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
కర్ణాటక, ఇతర ఏరియాల్లో కూడా ఈ సినిమా పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ఏపీలో కూడా ఈ సినిమాకు ఆక్యుపెన్సీ బాగానే ఉన్నా టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం పడుతోంది.
భీమ్లా నాయక్ కొన్ని ఏరియాలలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం.
"""/"/
భీమ్లా నాయక్ కలెక్షన్ల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
భీమ్లా నాయక్ సెకండ్ వీకెండ్ నాటికి డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే ఏపీలో మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రేపు శివరాత్రి పండుగ కావడంతో భీమ్లానాయక్ కు కలిసొస్తుందని చెప్పవచ్చు. """/"/
ఈ సినిమా 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఫుల్ రన్ లో భీమ్లా నాయక్ బాక్సఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.
మరోవైపు పవన్ కళ్యాణ్ సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
తెరి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్6, ఆదివారం 2024