ఆహా అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా పవన్ కల్యాణ్..!
TeluguStop.com
ఆహా అన్‌స్టాపబుల్ షో హోస్ట్ బాలయ్యతో భీమ్లా నాయక్ భేటీకానున్నారు.అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్ గా పవన్ కల్యాణ్ రానున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో షూటింగ్ కు బాలయ్య హాజరైయ్యారు.మరోవైపు షోలో పాల్గొనేందుకు పవన్ కల్యాణ్ అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకోనున్నారు.
అయితే పవన్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రస్తుత రాజకీయాల గురించి బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు జనసేనాని ఏ విధంగా సమాధానం ఇస్తారు.
? ఆయన క్వశ్చన్స్ కు పవన్ స్ట్రెయిట్ గా ఆన్సర్ చెప్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అటు బాలయ్య, ఇటు పవన్ కల్యాణ్ అభిమానులు సందడి చేస్తున్నారు.
జిడ్డుగల చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!