పవన్-సుజీత్ కొత్త సినిమా.. అఫిషియల్ అనౌన్స్.. పోస్టర్ అదిరిందిగా!
TeluguStop.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం కొన్నాళ్ళు సినిమాలకు దూరం అయ్యాడు.
ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు.వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫ్యాన్స్ ను మెప్పించాడు.
అయితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.పవన్ ఎన్ని సినిమాలను లైన్లో పెట్టినా వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.
సినిమాలు అయితే ప్రకటిస్తున్నాడు కానీ వాటిని పూర్తి చేయడానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నాడు.
అయితే ఈయన చేతిలో పూర్తి చేయని సినిమాలు ఉన్న కూడా మరో సినిమాను అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.
ఈ రోజు ఉదయం దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ నుండి ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ రావడంతో అంతా ముందు షాక్ అయ్యారు.
"""/"/
ఆ తర్వాత ఈ క్రేజీ వార్తను ఎంజాయ్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ మరియు యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో సినిమా ఉంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో ఈ సినిమాను అనౌన్స్ చేసారు.సుజీత్ నే ఈ సినిమాకు రచన, డైరెక్షన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.
ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కొన్ని జాపనీస్ పేర్లు హ్యాష్ ట్యాగ్స్ కూడా హైలెట్ చేసారు.
ఇంకా పవన్ నిలబడ్డ పోస్టర్ చుస్తే ఒక గాన్ కూడా కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ గా క్రియేటివ్ గా పోస్టర్ చేసారు.
మొత్తానికి పవన్, సుజీత్ కాంబోలో ఒక సెన్సేషన్ మూవీనే రాబోతుంది అని తెలుస్తుంది.
మరి ఈ క్రేజీ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.
సింహం డ్రెస్ వేసుకుని నిజమైన సింహాల దగ్గరికి వెళ్లాడు.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి!