కమిట్‌ అయిన సినిమాలకే దిక్కులేదు… పవన్‌ ఏంది ఈ రచ్చ?

పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు.ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షూటింగ్‌ మధ్య లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా మినహా ఏ ఒక్కటి పూర్తి చేసే పరిస్థితి లేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఈ సమయం లో పవన్ కళ్యాణ్ తాజాగా యంగ్ డైరెక్టర్ సుజిత్ చెప్పిన కథ కు ఫిదా అయ్యి సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

సాహో సినిమా ను చేసిన తర్వాత సుజిత్‌ ఇప్పటి వరకు మరో సినిమా ను చేయలేదు.

ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయాల్సి ఉన్న కూడా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదు.

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సుజిత్ రెడీ అవుతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

పవన్ కళ్యాణ్ ఎప్పటికి డేట్లు ఇస్తాడు.ఇచ్చిన డేట్లలకు నటిస్తాడో లేదో క్లారిటీ లేదు.

అయినా కూడా పవన్ పై నమ్మకం తో సుజిత్ కథ చెప్పి ఆయనతో ఓకే చెప్పించుకున్నాడు.

"""/"/ పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఆయన అభిమానులు సైతం ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు దిక్కు లేదు మళ్ళీ కొత్త సినిమాలు అవసరమా పవన్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట.

హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను మరియు ఒక తమిళ రీమేక్‌ సినిమా ను పవన్ కళ్యాణ్ కమిట్ అయ్యాడు.

ఆ రెండు సినిమా లు ఎప్పుడు పూర్తయితాయో.సురేందర్ రెడ్డి దర్శకత్వం లో సినిమా మొదలవుతుందో లేదో తెలియదు.

ఇలాంటి సమయం లో సుజిత్ దర్శకత్వం లో సినిమా అసలు మొదలయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఆ తర్వాత ఎన్నికల హడావుడి, బస్సు యాత్ర తో పవన్ కళ్యాణ్ సినిమాలకు డేట్లు ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…