పవన్, సముద్రకని మూవీ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
TeluguStop.com
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలతో సక్సెస్ ను దక్కించుకున్నాడు.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా లో నటిస్తున్నాడు.ఈ ఏడాదిలోనే హరి హర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది.
క్రిష్ సినిమా పూర్తి అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ను పవన్ కళ్యాన్ చేయాల్సి ఉంది.
కాని అంతకు ముందు ఒక రీమేక్ ను చేసేందుకు పవన్ సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వినోదయ సిత్తం ను పవన్ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే త్రివిక్రమ్ మరియు సాయి మాధవ్ బుర్ర కలిసి రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేశారు.
రీమేక్ కు స్క్రిప్ట్ వారు రెడీ చేసినా కూడా దర్శకత్వం మాత్రం ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.
ప్రస్తుతం సముద్రకని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.దర్శకుడు అయిన సముద్రకని ఈమద్య నటుడిగా బిజీగా ఉన్న కారణంగా వినోదయ సిత్తం రీమేక్ కాస్త ఆలస్యం అవుతుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు లో పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.
ఏకదాటిగా 35 నుండి 40 రోజుల పాటు షూటింగ్ చేస్తారట.దాంతో సినిమాను ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తద్వారా ఇదే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది.చాలా తక్కువ బడ్జెట్ తో సినిమాను పూర్తి చేయడం ద్వారా నిర్మాతకు మరియు బయ్యర్లకు రిస్క్ లేకుండా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఈ రీమేక్ కోసం పవన్ కు దాదాపుగా 50 కోట్ల పారితోషికం ముట్టబోతుందట.
ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన జులై లో వచ్చే అవకాశం ఉంది.
Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know