పవన్ – తేజ్ ‘బ్రో’ ఐటెం సాంగ్ కు హ్యాండ్ ఇచ్చిన రకుల్.. మరో భామను వెతుక్కోవాలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలో నటించాలని ఎంతో మంది భామలు కోరుకుంటారు.

ఆయన సినిమాలో ఐటెం సాంగ్( Item Song ) ఆఫర్ వచ్చిన కాదనకుండా చేయడానికి హీరోయిన్స్ రెడీగా ఉంటారు.

అంత క్రేజ్ ఉంది పవర్ స్టార్ కు.అయితే ఒక హీరోయిన్ మాత్రం ముందుగా ఐటెం సాంగ్ కోసం చేస్తానని చెప్పి మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది అని లాస్ట్ మినిట్ లో డేట్ లు అవైలబుల్ గా లేవని చెప్పి మేకర్స్ కు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

"""/" / పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''బ్రో''( BRO Movie ).

ఎన్నో రోజులుగా మెగా ఫ్యాన్స్ మెగా హీరోలు ఒక మల్టీ స్టారర్ చేస్తే చూడాలని ఆశ పడుతున్నారు.

ఈ క్రమంలోనే మామ అల్లుడు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు అందరిని ఆకట్టు కుంటుంది.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వర్క్ మొత్తం దాదాపు పూర్తి అయ్యింది.

జస్ట్ రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.వాటిని పూర్తి చేస్తే ఇక అంత ఫినిష్ అయినట్టే.

అందులో ఒకటి ఐటెం సాంగ్ కాగా ఈ సాంగ్ లో ఇద్దరు హీరోలు స్టెప్పులు వేయబోతున్నారు.

మరి ఈ పాటలో ఆడిపాడేందుకు ఒక భామను ఫిక్స్ చేసారు.ఎంతో మంది పేర్లు వినిపించగా చివరకు రకుల్ ప్రీత్ ను ఫిక్స్ చేసారు.

ఈమె ముందుగా ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుందట.అయితే సోమవారం షూట్ అయితే శుక్రవారం మేకర్స్ చెప్పారట.

"""/" / దీంతో ఈమెకు డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెప్పిందట.దీంతో ఇప్పటికిప్పుడు ఏం చేయాలా అని మేకర్స్ తర్జనభర్జనలు పడుతున్నారు.

పవన్ ను ఒప్పించి మళ్ళీ డేట్ ను అడగడమా? లేదంటే మరో బ్యూటీని ఈ సాంగ్ కోసం ఫిక్స్ చేయడమా అనే డిస్కర్షన్ లో మేకర్స్ ఉన్నారట.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

చూడాలి సముద్రఖని మన తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో.

రాముడిలా కనిపించేవాళ్లు రావణుడిలా కనిపించకూడదు.. ముఖేష్ కన్నా కామెంట్స్ వైరల్!