Pawan Kalyan : ఈ ఫొటోలో పవన్ తో కలిసి చనువుగా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా ?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ మరొకవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

మొదట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

కాగా అభిమానులు పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా పిలుస్తుంటారు.వెండి తెరపై పవన్ కళ్యాణ్ మేనరీజానికి మెగా అభిమానులు కూడా ఫిదా అవుతారు.

"""/" / ప్రజాసేవ చేయాలని 2014 మార్చిలో కళ్యాణ్ జనసేన పార్టీని( Janasena Party ) స్థాపించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి చనువుగా ఉన్న ఆ వ్యక్తి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ కు కొంతమంది ఆత్మీయ స్నేహితులు ఉన్నారన్న విషయం తెలిసిందే.అలాంటి స్నేహితుల్లో ఒకరు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి( Art Director Anand Sai ) కూడా ఒకరు.

20 ఏళ్లుగా వీరిద్దరూ స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు.కాగా ఆనంద్ సాయి తండ్రి కూడా ఆర్ట్ డైరెక్టర్.

అప్పట్లో మూవీకి సంబంధించిన పలు విషయాలు మాట్లాడేందుకు చిరంజీవి ఇంటికి వెళ్లేవారు. """/" / ఆనంద్ సాయి అతని తండ్రి.

ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తో పరిచయం ఏర్పడటం జరిగింది.సినీ ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ అని గతంలో పలుమార్లు చెప్పారు ఆనంద్ సాయి.

ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేశారు.2014లో ఆనంద్ సాయి చివరిసారిగా ఎవడు( Avadu ) చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఈ మూవీలో చెర్రీ, అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే.ఆ తర్వాత 2015లో పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీలో పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన స్కెచ్ లు వేశారు.

తర్వాత ఆయన ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టారు.యాదాద్రి ఆలయ పునరుద్ధరణ, శ్రీ రామానుజాచార్యుల సమానత్వ విగ్రహాన్ని తయారు చేసే పనిలో నిమగ్నం అయ్యారు.

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కోరిక మేరకు హరిహర వీర మల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాలకు పని చేయనున్నారు.

తాజాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్ అభిమానులు.

బాయ్‌ఫ్రెండ్ భారతీయుడని తెలిసి పాకిస్థానీ గర్ల్ ఎలా రచ్చ చేస్తుందో చూడండి..