ఆ విషయంలో పవన్ కళ్యాణ్, కూతురు ఆద్య సేమ్ టు సేమ్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి మనందరికీ తెలిసిందే.
మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయం దగ్గర పడడంతో పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టారు.
ఈసారి ఎలక్షన్స్ లో పిఠాపురం ( Pithapuram )నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
దాంతో పవన్ కళ్యాణ్ క్షణం కూడా తీరిక లేకుండా హడావిడిగా గడిపేస్తున్నాడు.ఇకపోతే ఇటీవల హరిహర వీరమల్లు టీజర్( Harihara Veeramallu Teaser ) తో అదరగొట్టిన పవన్ వింటేజ్ లుక్ లో వావ్ అనిపించాడు.
"""/" /
ఫ్యాన్స్ మురిసిపోయేలా రికార్డులు కొల్ల గొట్టాడు.ఇదిలా ఉంటే నెట్టింట పవన్, ఆయన కూతురు ఆద్యకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
ఆ ఫోటోస్ ని కంపేర్ చేస్తున్న అభిమానులు ఖుషి అవుతున్నారు.ఇకపోతే అసలు విషయంలోకి వెళితే పవన్ కళ్యాణ్ పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని యాంకర్ మీకు నచ్చిన పాట ఏంటి అని అడగగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ సాంగ్ ఏ తే ఏ మౌసం అంటూ పాట పాడి మరీ వినిపించారు.
ఇక ఆద్య( Adhya ) తొలిసారి ఆడియన్స్ కు అఫిషియల్ గా కనిపించిన షోలో కూడా తన ఫేవరెట్ సాంగ్ అంటూ ఇదే పాట పాడటం విశేషం.
"""/" /
దీంతో ఆ జీన్స్, బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది చెప్పండి.
ఇద్దరి ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి.ఆ విషయంలో మాత్రం ఇద్దరు సేమ్ టు సేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా ఆద్య ఆ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇకపోతే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, భగవదియుడు భగత్ సింగ్, లాంటి సినిమాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ అరెస్టుపై వేణు స్వామి భార్య షాకింగ్ కామెంట్స్… నేను ముందే చెప్పానంటూ?