పవన్ కి ఎన్ని? బాబు కి ఎన్ని? ఇదే నిన్నటి మీటింగ్ సారాంశం..!

2024 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుసుకున్న తర్వాత రాష్ట్రమంతటా ఇదే చర్చ వినిపిస్తోంది.

ఓ పక్క వైఎస్ఆర్సిపి వాళ్ళు ఈ భేటీ కి సంబంధించి తెగ ఊదరగొట్టేస్తున్నారు.

జగన్ ఒక్కడే వచ్చి మళ్లీ ఎన్నికల్లో పోరాడుతాడు అని రొమ్ములు విరుస్తున్నారు.ఇక జనసేన అభిమానుల్లో ఈ విషయమై మిశ్రమ స్పందన నెలకొంది.

అయితే టిడిపి అంతర్గత శ్రేణుల నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే పవన్ చంద్రబాబు మధ్య పొత్తు దాదాపు ఖాయం అయిపోయిందట.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తుగా జరిగిన ఈ మీటింగ్ లో పవన్ కనీసం 25 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంటు సీట్లు జనసేన కోసం బాబుతో బేరాలు జరిపారట.

బాబు మాత్రం కేవలం 15 అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు సీట్లు కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

"""/"/ క్రితం సారి ఎన్నికల్లో కూడా జనసేన మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది.

సిపిఐ, సిపిఎం పార్టీల మద్దతుతో అక్కడక్కడ ఖాళీలను పూరించింది.కానీ ఈసారి పరిస్థితి అలాగే ఉంటే వైసిపి నాయకుల తాకిడిని తట్టుకోవడం ఖాయం.

అయితే ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిందే.అటు ఇటు బేరాలు జరిపి చివరికి 15 అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు సీట్లు వద్ద బేరం తెగ్గొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

"""/"/ ఇదే గనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు.

తరాలుగా మెగా, నందమూరి మధ్య వస్తున్న వైరం గురించి అందరికీ తెలిసిందే.రాజకీయ లబ్ధి కోసం పొత్తులు లాంటివి పట్టించుకోరు కానీ మరి తక్కువ సీట్లకు సర్దిపెట్టుకుంటే మాత్రం పవన్ రాజకీయ జీవితంలో పెద్ద మచ్చను ఎదుర్కోబోతున్నట్టే.

మరి చివరికి లెక్కలు ఎంతవరకు తేలుతాయో చూడాలి.

నాన్న చేసిన అతి పెద్ద తప్పు అదే.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు!