నాకు తెలిసింది సినిమా మాత్రమే అంటూ జేడీ కి కౌంటర్ ఇచ్చిన పవన్
TeluguStop.com
జనసేన కీలక నేత జేడీ లక్ష్మీనారాయణ గురువారం తన రాజీనామా లేఖను సమర్పిస్తూ పార్టీ నుంచి నిష్క్రమించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే జేడీ లేఖ పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు.లక్ష్మీనారాయణ రాజీనామాను ఆమోదిస్తున్నామని తెలిపిన పవన్, తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, పాల ఫ్యాక్టరీలు లేవని వ్యాఖ్యానించిన పవన్, ప్రభుత్వ ఉద్యోగిలా నాకు వేలకు వేలు జీతాలు రావు అంటూ చురకలు అంటించారు.
తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనంటూ నా మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి అని పవన్ అన్నారు.
వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని తెలిపిన పవన్, ఇవన్నీ తెలుసుకొని రాజీనామా లేఖలో లక్ష్మీనారాయణ ప్రస్తావించి ఉంటే బాగుండేదంటూ పవన్ పేర్కొన్నారు.
ఆయన పార్టీకి రాజీనామా చేసినప్పటికీ వ్యక్తిగతంగాను, జనసైనికులకు ఆయనపై గౌరవం అలానే ఉంటుంది అని, ఆయనకు శుభాభి వందనాలు అంటూ పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
"""/"/
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఓ లేఖ ను కూడా రాశారు.
ముఖ్యంగా సినిమాల్లో నటించనంటూ పలు సందర్భాల్లో ప్రకటించిన మీరు మళ్లీ సినిమాలు చేస్తున్నారని మీ విధానాల్లో స్థిరత్వం లేదని, ఇలాంటి వారితో రాజకీయ ప్రయాణం కొనసాగించలేను అందుకే పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అయితే జేడీ రాజీనామా పై స్పందించిన జనసేన అధినేత జేడీ లేఖలో లేవనెత్తిన అంశాలకు పై విధంగా కౌంటర్ ఇస్తూ స్పందించారు.
ఓటీటీ రైట్స్‌తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలివే.. ఈ సినిమాలదే అద్భుతమైన రికార్డ్!