అక్కడినుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఎమ్మెల్యే అవుతారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని, సీఎం కావాలని అయనను అభిమానించే అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

అయితే పవన్ పోటీ చేసే నియోజకవర్గం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి.

గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో అనుకూల ఫలితాలు దక్కని నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి.

అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తే మాత్రం విజయం సాధించడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

పవన్ ను అభిమానించే అభిమానులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని పవన్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువేనని సమాచారం అందుతోంది.

మరి ప్రజల కామెంట్లను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారేమో చూడాల్సి ఉంది.

"""/"/ పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా ఆయన కచ్చితంగా సక్సెస్ సాధించేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తామని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు తనతో ఉన్నవాళ్లకు కచ్చితంగా టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

"""/"/ త్వరలో పవన్ కళ్యాణ్ కూడా అధికారికంగా తాను ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గానికి సంబంధించి వివరాలను వెల్లడించే అవకాశాలు అయితే ఉంటాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకుని ఎప్పటికి థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

హరిహర వీరమల్లు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

ఇంద్రసేనా రెడ్డి అంటూ ఇంద్ర రీ రిలీజ్ పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్!