ప్రతి రోజును నా చివరి రోజుగా బ్రతుకుతా.. పవన్ ఎమోషనల్ కామెంట్స్!

సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Renu Desai) సంతానంగా ఉన్నటువంటి అకీరా ( Akira ) ఆద్య ( Adhy A) గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రాజకీయాలలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలలో సంపాదించినది మొత్తం రాజకీయాలకే ఖర్చు చేస్తున్నారు ఈ విషయం గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఇలా సంపాదించినది మొత్తం ఖర్చు చేస్తుంటే మీ పిల్లలు వీటిని ఖండించలేదా అని ప్రశ్నించారు.

"""/" / ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ నేను నా పిల్లలకు కావలసిన అన్ని అవసరాలను తీర్చానని వెల్లడించారు.

వారి పేరు మీద ఇప్పటికే కొన్ని ప్రాపర్టీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఒక సాధారణ ఉద్యోగి తన పిల్లలకు ఎలాంటి అవసరాలు అన్నింటిని తీరుస్తారో నేను కూడా నా పిల్లలకు అన్ని అవసరాలు తీర్చానని తెలిపారు.

ప్రతి ఒక్కరు వారి జీవితంలో ధైర్యంగా వాళ్ళ కాళ్లపై నిలబడగలగాలి అందుకే తన పిల్లలకు ప్రైమరీ స్టడీస్ అన్నింటిని అందించామని తెలిపారు.

"""/" / మన పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదు వారు ఆస్తిని ఎలా నిలబెట్టుకున్నారు అన్నదే ముఖ్యమని తెలిపారు.

మా నాన్న నాకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదు కేవలం ధైర్యం మాత్రమే ఇచ్చారు.

ఇక మా అన్నయ్య నుంచి కొన్ని స్కిల్స్ నేర్చుకుని నేడు ఈ స్థాయిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ కి తెలిపారు.

ఇక నేను ప్రతి రోజును ఇదే నా చివరి రోజుగా బ్రతుకుతాను రేపటి రోజు పై నాకు ఎలాంటి ఆశలు లేవు అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పేరు తలుచుకుంటే చాలు ఆక్సిజన్ లభిస్తుంది: చంద్ర బోస్