పార్టీ ని బలోపేతం చేసే పనిలో జనసేనాని పవన్ కళ్యాణ్
TeluguStop.com
జనసేన పార్టీ పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశలు అడియాశలు అయ్యాయి.
రాష్ట్ర రాజకీయాలలో మార్పు చోటుచేసుకోవాలని పవన్ తపనకు గండిపడినట్లు అయ్యింది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్కసీటును మాత్రమే నెగ్గించుకున్న సంగతి తెలిసిందే.
జనాలకు ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా నిజాయితీ గా పార్టీ ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించిన పవన్ కు చుక్కెదురైంది.
అయితే ప్రజల తీర్పును గౌరవించిన పవన్ ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలతోనే ఉంటాం అని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలో ఇప్పుడు పార్టీ ని బలోపేతం చేసే పనిలో పడ్డారు.ఈ నెల 5 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు కూడా ఆయన అమరావతిలోని మకాం వేయనున్నట్లు తెలుస్తుంది.
"""/"/
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గ్రామస్థాయి వరకు కమిటీలు వేసే ఆలోచనలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఈ నేపథ్యంలో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్య చరణ పై పార్టీ నేతల తో చర్చించనున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేసినా.2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీకి దిగారు.
ఇక ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాత్రమే విజయం సాధించగా.జనసేన అధినేత కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?