పవన్ రాజకీయాల్లో కమెడియన్.. మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.

పవన్ సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో మాత్రం కమెడియన్ అని ఎద్దేవా చేశారు.

సినిమాలు మరియు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక్కరే హీరో అని మంత్రి అంబటి అన్నారు.

పవన్ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారన్నారు.రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జనసేన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందా అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడన్న ఆయన పోలవరం విషయంలో ఏమీ దాచిపెట్టడం లేదని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై పుకార్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

ప్రమోషన్స్ విషయంలో వెంకీనే తోపు.. బాలయ్య, చరణ్ నేర్చుకోవాల్సిందే!