ఆ పదవి పై పవన్ ఆశలు ! బాబు ఒప్పుకుంటారా .. ? 

ఒకవైపు రాజకీయంగా జనసేన ను బలోపేతం చేస్తూనే తన చిరకాల వాంఛను నెరవేర్చుకునే పనులు ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదనే విషయాన్ని గుర్తించే టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్,  ఆ పార్టీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.

వైసిపి మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.ఈ మేరకు టిడిపి( TDP )తో కలిసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు,  భారీ బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే టిడిపి తో పొత్తు విషయంలో జనసేన నాయకులకు అనేక అనుమానాలు ఉండడం,  ఇప్పటికీ చాలామంది నేతలు ఆ పొత్తును వ్యతిరేకిస్తుండడంతో , పవన్ ఘాటుగానే దీనిపై స్పందించారు.

టిడిపి తో పొత్తు అంశంపై ఎవరు విమర్శలు చేయవద్దని, ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని పవన్ చెబుతున్నారు.

ఇక నిన్న విశాఖ సభలో పవన్ అనేక అంశాలపై స్పందించారు.ఏపీకి సీఎం అయ్యే ఛాన్స్ జనసేనకు ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

"""/" / కొద్దిరోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీసులోనూ పవన్( Pawan Kalyan ) ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.

  తాజాగా విశాఖ సభలో సీఎం పదవి గురించి తాను చంద్రబాబుతో చర్చిస్తానని పవన్ అన్నారు .

సీఎం అని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉండడంతో,  సీఎం సంగతి తాము నిర్ణయిస్తామని ముందు టిడిపి జనసేన లను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని పవన్ కోరారు.

నిజంగా టిడిపి , జనసేన ప్రభుత్వం ఏర్పడితే సీఎం సీటు పవన్ కోసం త్యాగం చేసేందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా అనేది అనుమానమే.

  ఇక 175 అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 88 ఎవరికి వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.

టిడిపి జనసేనతో( TDP, JANA SENA ) పొత్తు ఉన్న నేపథ్యంలో ఆ సీట్లు సాధిస్తామనే నమ్మకం రెండు పార్టీల్లోనూ ఉంది.

పొత్తులో భాగంగా జనసేనకు 30 వరకు సీట్లు కేటాయించినా,  మిగతా సీట్లలో టిడిపి పోటీ చేస్తుంది.

రెండు పార్టీల పొత్తుతో కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమా ను టిడిపి వ్యక్తం చేస్తుంది .

"""/" / ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా జనసేనకు ఒకటో రెండో మంత్రి పదవులు టిడిపి కేటాయిస్తుంది తప్ప,  సీఎం సీటును జనసేన కోసం చంద్రబాబు త్యాగం చేసే చాన్సే ఉండదు.

కానీ ఎన్నికల సమయం నాటికి రాజకీయంగా జనసేన బలోపేతం అయితేనే జనసేనకు ఆ స్థాయిలో ప్రాధాన్యం దక్కుతుందని పవన్ గుర్తించారు .

పొత్తులో భాగంగా టిడిపి నుంచి మరిన్ని ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలన్నా, సీఎం సీటు ను తమకే కేటాయించాలని టిడిపిని డిమాండ్  చేసే పరిస్థితి రావాలన్నా, జనసేన పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిస్తేనే ఆ ఛాన్స్ ఉంటుందని పవన్ బలంగా నమ్ముతున్నారు.

అందుకే కేడర్ ను కూడా ఉత్సాహపరుస్తూ వారు మరింత చురుగ్గా పనిచేసే విధంగా పవన్ తన ప్రసంగాలు ఉండేలా చూసుకుంటున్నారు.

రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!