అంబటి రాయుడు కి సీటు ఫిక్స్ చేసిన పవన్ ! ఎక్కడంటే ?
TeluguStop.com
ఎప్పటి నుంచో రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ, వైసిపికి దగ్గరగా ఉంటూ వస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఊహించని విధంగా జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు .
వైసిపి నుంచి ఎంపీ టికెట్ ఆశించినా, టికెట్ దక్కకపోవడంతో అంబటి రాయుడు చివరకు జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
దాదాపు మూడు గంటల పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు .ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం.
15 రోజుల క్రితమే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ( CM YS Jagan )ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్న అంబటి రాయుడు 10 రోజుల్లోనే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు.
దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో వివరణ కూడా ఇచ్చారు. """/" /
దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ లో ఆడేందుకే తాను వైసిపికి రాజీనామా చేశానని , క్రికెట్ ఆడాలంటే ఏ రాజకీయ పార్టీలోను ఉండకూడదని అంబటి రాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
అంబటి రాయుడు క్రికెట్ ఆడేందుకు వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతుండగా, అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ ను కలవడం సంచలనంగా మారింది.
జనసేన లో చేరేందుకే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు అర్థమవుతుంది.దీంతో ఆయన ను ఎక్కడ నుంచి పోటీకి దింపాలనే విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్ గానే ఆలోచిస్తున్నారు.
టిడిపితో పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాలతో పాటు , పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులను పోటీకి దింపాలని పవన్ భావిస్తున్నారు .
ఈ నేపథ్యంలో అంబటి రాయుడును( Ambati Rayud ) ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో పవన్ ఉన్నట్లు సమాచారం.
గుంటూరు లేదా మచిలీపట్నం పార్లమెంట్ స్థానాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.గుంటూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాల్లో ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారినే టిడిపి పోటీకి దింపుతోంది.
"""/" /
విజయవాడ ఎంపీ కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు.గుంటూరులో గల్లా జయదేవ్ సైతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు .
ఇక మచిలీపట్నం( Machilipatnam ) నుంచి అంబటి రాయుడు ను పోటీకి దింపితే ఫలితం అనుకూలంగా ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారట .
ప్రస్తుతం అక్కడ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావును అసెంబ్లీకి పంపాలనే ప్రతిపాదనను టిడిపి ముందు ఉంచి, పొత్తులో భాగంగా ఆ సీటు తమకు కేటాయించాలని పవన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టీడీపీ ఈ ప్రతిపాదన కు అంగీకరిస్తే మచిలీపట్నం సీటు ను అంబటి రాయుడు కి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా జనసేన లోని కీలక వ్యక్తుల ద్వారా తెలుస్తోంది.
బాలయ్య బాబీ కాంబో మూవీలో ముగ్గురు హీరోయిన్లా.. క్లైమాక్స్ లో అలాంటి ట్విస్ట్ ప్లాన్ చేశారా?