అమెరికాలో ఖుషి చాలా పెద్ద బ్లాస్ట్ అవ్వబోతుంది అంటున్న పవన్ ఫ్యాన్స్
TeluguStop.com
పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి సినిమా కొత్త సంవత్సరం కానుకగా మరో సారి అభిమానుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
సూర్య దర్శకత్వం లో రూపొందిన ఖుషి సినిమా డిసెంబర్ 31, 2022న మళ్లీ విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటించారు.
తాజాగా అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల అయింది.పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా యొక్క రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు చాలా ఎక్కువ అయ్యాయి.కనుక ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో చేసే హడావుడి అంతా అంతా కాదు.
అదే హడావుడి బాక్సాఫీస్ వద్ద కూడా చేయాలనే ఉద్దేశంతో సరి కొత్త రికార్డు కోసం వెయిట్ చేస్తున్నారట.
"""/"/
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికా లో ఈ సినిమా కు అత్యధిక కలెక్షన్స్ వచ్చేలా ప్లాన్ చేశారట.
దాదాపు మిలియన్ డాలర్ల ను అక్కడ వసూలు చేసి పెట్టాలి అని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక పాత సినిమా.అది కూడా రెండు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమా ఇప్పుడు విడుదల అయ్యి మిలియన్ డాలర్లు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు.
హాలీవుడ్ సినిమాలకే అది సాధ్యం.కనుక పవన్ కళ్యాణ్ సినిమా కు ఆ అరుదైన రికార్డ్ ని సొంతం చేసి పెట్టాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
డిసెంబర్ 31 వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం అనిపిస్తుంది.
అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
కనుక ప్రతి చోట కూడా కలెక్షన్స్ మంచిగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025