రేపే ‘బ్రో’ సినిమా రిలీజ్ .. ఆందోళనలో ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా రేపు విడుదల కాబోతుంది.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పవన్ మరియు తేజ్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజున అత్యధిక కలెక్షన్స్ తో రికార్డు నెలకొల్పాలని ప్లాన్ చేశారు.

అయితే ఫ్యాన్స్ ఆశలకు భారీ వర్షాలు, వరదలు అడ్డుకట్ట వేశాయి.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో బెన్ ఫిట్ షోలు కూడా వేసుకోలేని పరిస్థితి నెలకొంది.

దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

గత 75 ఏళ్లలో సూర్యకాంతం అనే చక్కటి పేరు పెట్టుకోకుండా చేసిన నటి..?