పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి శంషాబాద్‌లో 11 ఎకరాల స్థలం ఉందా…?
TeluguStop.com
బద్రి సినిమాతో టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీకి పరిచయమైన రేణు దేశాయ్( Renu Desai ) ఆ తర్వాత ఎక్కువగా సినిమాలు చేయలేదు.
పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని మూడేళ్లలోనే అతడి నుంచి విడాకులు తీసుకుంది.
మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఆమె టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ తన గురించి చాలా విషయాలనే బయటపెట్టింది.
ఓ ఇంటర్వ్యూలో "మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు.మామూలుగా కేర్ తీసుకుంటే సరిపోతుంది.
వారిని చూసుకోవాల్సిన పనిలేదు.ఇక మీరు సినిమాలు కూడా చేయడం లేదు.
మరి మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు రేణు ఆసక్తికర సమాధానం చెప్పింది.
"""/" /
రేణు బదులిస్తూ "నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో ఉన్నాను.మా నాన్న కూడా ల్యాండ్ డెవలపర్.
హైదరాబాద్‌లో నాకు ఎక్కడా 11 ఎకరాల స్థలం లేదు.శంషాబాద్( Shamshabad ) లో ఉందని అంటారు కానీ అది అబద్ధం.
నేను అసలు ఓపెన్ ల్యాండ్స్ కొనను.అపార్ట్‌మెంట్స్ మాత్రమే కొంటాను.
జయభేరీ అపార్ట్‌మెంట్స్‌లో ( Jayabheri Apartments )నాకు ఒక అపార్ట్‌మెంట్ ఉంది.నేను నా ప్రాపర్టీస్ గురించి ఎవరికీ తెలపను.
కన్‌స్ట్రక్షన్ టైమ్‌లో, లేదంటే కట్టడం పూర్తయ్యాక నేను ఏదైనా ఇల్లు కొంటాను.కొంచెం ప్రాఫిట్ వస్తుంటే అమ్మేస్తాను.
సినిమాలు చేయకపోయినా నాకు ఎలా డబ్బులు వస్తాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు.వారందరికీ నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, దాన్నుంచి సంపాదిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను.
" అని చెప్పుకొచ్చింది. """/" /
అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు ఎంత డబ్బులు వస్తాయో చెప్తారా అని అడిగితే ఆమె అందుకు నిరాకరించింది.
అది తన పర్సనల్ విషయం అని, ఇన్‌కమ్ ట్యాక్స్, తనకు తప్ప ఆ వివరాలు ఎవరికీ తెలియని, ఎవరికీ కూడా చెప్పను అని ఆమె స్పష్టం చేసింది.
తన నాన్నమ్మ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో తాము ఉన్నామని వెల్లడించింది.రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె చాలా రిచ్ అని ఇప్పుడే తమకు తెలిసిందని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
అకిరా నందన్, ఆధ్య కొణిదెల మంచి రిచ్ లైఫ్ స్టైల్ లేట్ చేస్తూ ఉండొచ్చని మరికొందరు పేర్కొన్నారు.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఆస్తి వివరాలు ఎన్ని సార్లు అడిగి ఇబ్బంది పెట్టినా రేణు కొంచెం కూడా కోప్పడలేదని, ఆమె చాలా కూల్ పర్సన్ అని ఇంకొందరు అన్నారు.
వీడియో వైరల్: ఒకే వేదికపై సచిన్, వినోద్ కాంబ్లీ.. సచిన్‌ను చూడగానే?