కాపు రిజర్వేషన్ పై వెంటనే స్పందించాలంటున్న పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల అంశం పై మొదటి నుంచి సైలెంట్ గానే ఉంటున్నారు.

కొద్ది నెలల క్రితం కాపు రిజర్వేషన్ అంశంపై స్పందించి వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఇక పూర్తిగా ఈ రిజర్వేషన్ల అంశంపై జనసేన తరఫున స్పందిస్తే కాపు పార్టీగా తమపై ముద్ర పడుతుందని , మిగతా వర్గాలు జనసేనకు దూరమవుతాయని పవన్ భావించారు.

ఈ వ్యవహారంపై గట్టిగా పోరాటం చేయలేక, సైలెంట్ గా ఉండలేక పవన్ గత కొంతకాలంగా సతమతం అవుతూనే ఉన్నారు.

అయితే ఏపీలో కాపులంతా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని, పవన్ ను ముఖ్యమంత్రిగా చేయాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆయన భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోని తాజాగా కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ మాట్లాడారు.ఈ రిజర్వేషన్ల అంశంపై ఏపీ సీఎం జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

అయితే ఇప్పటికిప్పుడు పవన్ ఈ డిమాండ్ వినిపించడానికి కారణాలు ఉన్నాయి.మాజీ హోం మంత్రి సీనియర్ పొలిటిషన్ చేగొండి హరి రామ జోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

గత టిడిపి ప్రభుత్వం కల్పించిన కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.

"""/"/ జోగయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.అయితే ఈ దీక్షను పోలీసులు భగ్నం చేసి జోగయ్యను ఆసుపత్రికి తరలించినా, అక్కడ కూడా ఆయన ఈ దీక్షను కొనసాగిస్తున్నారు.

దీంతో దీక్షపై తాజాగా పవన్ స్పందించారు.ఇప్పటికే జోగయ్య కు ఫోన్ చేసి పరామర్శించిన పవన్ ఈ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడారు.

మాజీ మంత్రి హరీ రామ జోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించాలని, 85 సంవత్సరాల వయసులో జోగయ్య గారు దీక్ష చేపట్టారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నానంటూ పవన్ స్పందించారు.

ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!