బాబాయ్-అబ్బాయ్ ఒకే ఫ్రేమ్ లో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.. పిక్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు అమితమైన ఆనందం అనే చెప్పాలి.

ఈయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో విషెష్ కూడా అలానే వస్తాయి.మరి నిన్న పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు జరుపు కున్నాడు.

దీంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా హడావిడి చేసారు.సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు విషెష్ తెలిపారు.

ట్విట్టర్ వేదికగా తన బాబాయ్ పవన్ తో దిగిన ఫోటోను షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ ఫొటోలో వీరిద్దరితో పాటు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా ఉన్నాడు.

ముగ్గురు కూడా చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ క్రమంలోనే చరణ్ బాబాయ్ కు విషెష్ చెబుతూ. """/"/ ''నా గైడింగ్ ఫోర్స్ పవన్ కళ్యాణ్ బాబాయ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఈ ఏడాది మొత్తం అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేసి ఫోటో షేర్ చేసాడు.

ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు మెగా హీరోలను చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ అకేషన్ ఏంటో తెలియదు కానీ ఈ ఫోటో మాత్రం అందరిని ఆకట్టు కుంటుంది.