నేటి నుంచే పవన్ చంద్రబాబు ఉమ్మడి రోడ్ షో 

పూర్తిగా ఎన్నికల ప్రచారంపైనే దృష్టి సారించిన టిడిపి, జనసేన( TDP, Jana Sena ) పార్టీలు ఉమ్మడిగా రోడ్డు షోలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ఇప్పటి వరకు విడివిడిగా టిడిపి ,జనసేన బిజెపిలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.అయితే విడివిడిగా ప్రచారాలు చేయడం వల్ల అనుకున్నంత స్థాయిలో జనాలు నుంచి స్పందన కనిపించకపోవడంతో,  టిడిపి, జనసేన పార్టీల అధినేతలు ఇద్దరు కలిసి రోడ్డు షోలు,  బహిరంగ సభలు నిర్వహించే విధంగా ప్లాన్ చేసుకున్నారు.

కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.

ఈ మేరకు నేటి నుంచి చంద్రబాబు , పవన్ రోడ్డు షోలు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సాయంత్రం నాలుగు గంటలకు రోడ్డు షో నిర్వహిస్తారు.

ఆ తరువాత చంద్రబాబు పవన్ కళ్యాణ్( Chandrababu , Pawan Kalyan ) రోడ్డు మార్గాన తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు.

"""/" /  నిడదవోలు గణేష్ చౌక్ సెంటర్ లో రోడ్ షో  నిర్వహిస్తారు.

ఈ మేరకు రెండు పార్టీలు ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణ పైన దృష్టి పెట్టాయి.

అలాగే సభల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు .ఈ పర్యటనలోనే అసంతృప్త నేతలకు బుద్ధిగింపు చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తణుకు, అమలాపురంలో టిడిపి, నిడదవోలు , పి గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తితో ఉండడంతో,  కూటమి అభ్యర్థులకు సహకారం సరిగా అందించడం లేదనే నివేదికలు పార్టీ అధినేతలకు అందాయి.

దీంతో వీరిద్దరి పర్యటన లో అసంతృప్తి నేతలతో మాట్లాడి వారిని బుజ్జగించే ప్రయత్నం చేయబోతున్నారు.

"""/" / తామిద్దరం కలిసి పర్యటిస్తున్నామని, కేడర్ కూడా కలిసి పని చేయాలనే మెసేజ్ ను రెండు పార్టీ శ్రేణుల్లోకి పంపాలని నిర్ణయించుకున్నారు.

గురువారం అమలాపురం, పి.గన్నవరంలో చంద్రబాబు , పవన్ పర్యటిస్తారు.

ఉదయం 10 గంటలకు చంద్రబాబు( Chandrababu ) ఉభయ గోదావరి జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.

అనంతరం కలిసి పని చేయాల్సిన అవసరం ,అసంతృప్తులు ,ఏకపక్ష వైఖరితో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన చంద్రబాబు చర్చించనున్నారు.

ఆ తరువాత అంబాజీపేట , అమలాపురంలలో జరిగే బహిరంగ సభలలో పవన్ , చంద్రబాబు పాల్గొంటారు.

నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!