ప‌వ‌నేంటి.. అడ్డంగా బుక్క‌యిపోతున్నాడు…!

అదేం ఖ‌ర్మో.ప‌వ‌న్ అన్ని విష‌యాల్లోనూ అడ్డంగా దొరికిపోతున్నారు అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌న‌సేన పార్టీ అధినేత‌గా ఆయ‌న త‌న‌కంటూ.ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఇంత‌లోనే దానిని మ‌రిచిపోయి.

బీజేపీతో అంట‌కాగ‌డం.ఆ వెంట‌నే కొన్ని చోట్ల ఏకంగా ఎన్నిక‌ల‌కు పోటీ లేకుండా చేసుకోవ‌డం .

వంటివి రాజ‌కీయంగా ప‌వ‌న్‌కు పెద్ద ఇబ్బందిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఆది నుంచి త‌ను ఎటు అడుగులు వేస్తున్నాడో తెలియ‌ని ప‌రిస్థితి ప‌వ‌న్‌ను వెంటాడుతూనే ఉంది.

మ‌రి ఫాంలో ఉన్న స‌మయంలో ఎన్నిక‌ల‌కు పోటీ చేయ‌నని చెప్పిన ప‌వ‌న్‌.2019లో ఎన్నిక‌ల‌కు రెడీ అయ్యారు.

అయితే.ఇక్క‌డ కూడా త‌న వ్యూహాత్మ‌క త‌ప్పిదాల‌తో అడుగులు త‌డ‌బాటు వేసుకున్నారు.

దీంతో ప‌వ‌న్ ప‌రాజ‌యం పాల య్యారు.పోనీ.

హోదా ఉద్య‌మాన్ని త‌లకెత్తుకుంటాన‌ని చెప్పి.ఏమైందో ఏమో మ‌ధ్య‌లోనే వ‌దిలేశాడు.

ఇక‌, రాజ‌ధాని ఉద్య‌మం విష‌యంలోనూ ఆదిలో అనేక కామెంట్లు చేసిన ప‌వ‌న్‌.త‌ర్వాత మాత్రం చేతులు ఎత్తేశాడు.

ఇక‌, ఆ త‌ర్వాత వేసిన అడుగులు కూడా ఆశించిన విధంగా ఫ‌లితాలు ఇవ్వ‌లేదు.

ఇక‌.పూర్తికాలం పార్టీకే త‌న జీవితాన్ని అంకితం చేస్తాన‌ని చెప్పినా.

త‌ర్వాత మాత్రం అంద‌రూ సంపాయించుకుంటున్నారు.నేనెందుకు ఖాళీగా ఉండాల‌న్న పిలుపు ఇచ్చి.

వెంట‌నే షూటింగుల‌కు వెళ్లిపోయారు.దీంతో ఏపీలో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

పేరుకు పార్టీ ఉంది త‌ప్ప‌.నిజానికి ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌వ‌న్‌ను ప్ర‌తి ఒక్క‌రూ మ‌రిచిపోయారు.

నిజానికి గ్రామీణ స్థాయిలో మాత్రం.ప‌వ‌న్ ఊసు ఎత్తేవారు కూడా క‌నిపించడం లేదు.

ఇదిలావుంటే.ప‌వ‌న్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

దీంతో యూత్‌లోకొంచెం జోష్ క‌నిపించింది.అంతేకాదు.

టీఆర్ఎస్‌లోనూ ఒకింత జంకు వ‌చ్చింది.ఓట్లు చీలిపోతే.

త‌మ‌కు ఇబ్బందేన‌ని అనుకుంది. అయితే.

ఇంత‌లోనే ఏం జ‌రిగిందో తాను పోటీ చేయ‌డం లేద‌ని.బీజేపీకి మ‌ద్ద‌తుదారుగా ఉంటాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

దీంతో ప‌వ‌న్‌పై వ్యంగ్యాస్త్రాలు ప‌డుతున్నాయి.జ‌న‌సేన పార్టీ బ‌దులు జ‌న‌సేన మ‌ద్ద‌తు పార్టీ అని పెట్టుకుంటే బెట‌ర్ అని అంటున్నారు.

మ‌రోవైపు తిరుప‌తి ఉప పోరులో కూడా ప‌వ‌న్ పార్టీ నేరుగా పోటీ చేసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇక్క‌డ కూడాబీజేపీ బ‌రిలోకి దిగ‌నున్న నేప‌థ్యంలో ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వాలి జ‌న‌సేన‌తో ఇప్ప‌టికే చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

సో.మొత్తంగా చూస్తే.

క‌నుచూపు మేర‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఎక్క‌డా ఒంట‌రిగా బ‌రిలో దిగే ప్ర‌య‌త్నం చేయ‌ద‌ని తేలిపోయింది.

అంటే.జ‌న‌సేన కేవ‌లం మ‌ద్ద‌తు పార్టీగానే.

మిగిలిపోతుంద‌ని అంటున్నారు.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..