పవన్‌ పై అభిమానం.. అత్యుత్సాహంతో పొరబడ్డ బండ్ల, ఈషా

పవన్‌ కళ్యాణ్‌ కు అభిమానులతో పాటు దురాభిమానులు కూడా ఉన్నారు.అంటే పవన్‌ కు యాంటీ ఫ్యాన్స్‌ కూడా చాలా మందే ఉన్నారు.

పవన్‌ అభిమానులకు వారికి మద్య సోషల్‌ మీడియాలో ఎప్పుడు వార్‌ కొనసాగుతూనే ఉంటుంది.

వారు యాంటీ ఫ్యాన్స్‌ ఎవరి ఫ్యాన్స్‌ అనే విషయాన్ని పక్కన పెడితే వారు పవన్‌ అభిమానులను తెగ చిరాకు పెడుతూ ఉంటారు.

సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ట్యాగ్స్‌ విషయంలో వారు చేసే చిల్లర పనులతో కొన్ని సార్లు సినీ ప్రముఖులు కూడా తప్పులో కాలేశారు.

తాజాగా పవన్‌ బర్త్‌ డేకు యాంటీ పవన్‌ ఫ్యాన్స్‌ చేసిన పనితో బండ్ల గణేష్‌ ఈషా రెబ్బాలు విమర్శలపాలయ్యారు.

నిన్న పవర్‌ బర్త్‌ డే సందర్బంగా ఫ్యాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే పవన్‌ అంటూ ట్విట్టర్‌ లో హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేశారు.

అయితే యాంటీ ఫ్యాన్స్‌ ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ను కాస్త మార్చి హ్యాపీ బర్త్‌ డే పావల కళ్యాణ్‌ అంటూ మార్చేసి హ్యాష్‌ ట్యాగ్‌ పోస్ట్‌ చేశారు.

కొందరు స్పెల్లింగ్‌ ను సరిగా చూసుకోకుండా పోస్ట్‌ చేశారు.బండ్ల గణేష్‌ ఈషా రెబ్బాలతో పాటు వందలాది మంది పవన్‌ అభిమానులు పొరపాటున యాంటీ ఫ్యాన్స్‌ వేసిన హ్యాష్‌ ట్యాగ్‌తో పవన్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

"""/"/ ఈ విషయం వారికి తెలిసే లోపు వందల మంది ఆ ట్వీట్‌ ను షేర్‌ చేయడం స్క్రీన్‌ షాట్‌ తీసుకోవడం జరిగింది.

దాంతో అంతా రచ్చ రచ్చ అవుతోంది.పవన్‌ ఫ్యాన్స్‌ వారిని కాస్త స్పెల్లింగ్‌ చూసుకుని ట్వీట్‌ చేస్తే ఏమయ్యింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

వారు ఈ విషయంలో ఎలాంటి స్పందన ఇవ్వలేదు.కాని వెంటనే డిలీట్‌ చేసి మరో ట్వీట్‌ చేశారు.

వారు పొరపాటున చేసిందే అని అందరికి తెలుసు.పవన్‌ కు శుభాకాంక్షలు తెలపాలనే అత్యుత్సాహంతో అలా జరిగి ఉంటుందని ఫ్యాన్స్‌ కూడా దాన్ని లైట్‌ తీసుకుంటున్నారు.

బిగ్ బాస్ 8: సోనియా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అలా చేసిందేమిటి?