'భీమ్లా నాయక్' వచ్చేసాడు.. పవన్ ఇరగదీసాడుగా !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియం' అనే మలయాళ రీమేక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేసారు.

ఈ రోజు అప్డేట్ రాబోతుందని రెండు రోజులు ముందుగానే ప్రకటించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

ఈ టీజర్ లో పవన్ లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనం ఇవ్వడమే కాకుండా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చారనే చెప్పాలి.

అంతేకాదు పవన్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ చుస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి.

రేయ్ డానీ బయటకు రారా.అనే డైలాగ్ తో పవన్ భీమ్లా నాయక్ టీజర్ స్టార్ట్ అయ్యింది.

ఈ మాస్ డైలాగ్స్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. """/"/ ఈ టీజర్ అనుకున్న కన్నా బాగా ఉండడంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అనే చెప్పాలి.చివర్లో భీమ్లా నాయక్ అనే టైటిల్ వేసి జనవరి 12, 2021 కి విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.

అంతేకాదు ఇంకా వరుసగా అప్డేట్ లు ఇస్తూనే ఉంటామని తెలిపారు.సెప్టెంబర్ 2 నుండి పాటలు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.

"""/"/ ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్ మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుంటే.రానా సరసరా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.

అమెరికాలో ఇల్లు కొన్న భారత సంతతి ట్రక్ డ్రైవర్ .. ఎంతో తెలుసా, నోరెళ్లబెడుతోన్న నెటిజన్లు