ఆ పరిస్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవాలి.. పవిత్రా లోకేష్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన పవిత్రా లోకేష్( Pavitra Lokesh ) ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

నరేష్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా( Malli Pelli Movie ) మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

నరేష్ ( Actor Naresh ) మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

మళ్లీ పెళ్లి ట్రైలర్ ను చూసిన చాలామంది ఈ సినిమా నరేష్ పవిత్ర బయోపిక్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర లోకేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పలు సందర్భాల్లో పవిత్ర లోకేశ్ పరువు పోయే విధంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఘటనల గురించి స్పందించడానికి గతంలో పవిత్ర లోకేశ్ ఇష్టపడలేదు.తాజాగా ఈ ఘటనల గురించి స్పందించిన పవిత్ర లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

"""/" / నరేష్, నేను ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కలిగి ఉన్నామని ఇష్టంతోనే కలిసి బ్రతుకుతున్నామని ఆమె అన్నారు.

మేము వీధిలో పడాలని ఎప్పుడూ అనుకోలేదని పవిత్ర లోకేశ్ చెప్పుకొచ్చారు.అయితే కొంతమంది మాత్రం నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆమె తెలిపారు.

ఈ తరహా పరిస్థితులు ఎదురైతే ఎంత హుందాగా వ్యవహరిస్తాం అనేది కూడా ముఖ్యమని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేశారు.

"""/" / నాకు అలాంటి పరిస్థితులు ఎదురైన సమయంలో కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయని ఒకటి ఆత్మహత్య చేసుకోవడం లేదా రెండోది ఎవరికీ కనబడకుండా ఇంట్లో కూర్చోవడమని ఆమె అన్నారు.

ఆ పరిస్థితులు ఎదురైన సమయంలో నరేష్ నాకు అండగా నిలిచారని పవిత్ర చెప్పుకొచ్చారు.

నరేష్, నేను ఎవరికీ హాని చేయడం లేదని మా ఇష్ట ప్రకారం జీవనం సాగిస్తున్నామని పవిత్ర పేర్కొన్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది… ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!