ఇండియాలో ఇప్పుడు వీళ్ళదే హాట్ టాపిక్.. పవిత్ర, నరేష్ బంధంపై స్టింగ్ ఆపరేషన్!

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల గురించి ఏదైనా వార్త వస్తే చాలు వెంటనే అది వైరల్ గా మారాల్సిందే.

ఎందుకంటే వారి మధ్య జరిగే సంఘటనలు అలా ఉంటాయి కాబట్టి.ఇక వారి రిలేషన్షిప్ కు సంబంధించిన విషయాలు వస్తే మాత్రం వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే ఎంతోమంది నటీనటుల రహస్యాలు బయటపడి అందరి దృష్టిలో పడ్డాయి.ఇప్పుడు తాజాగా మరో సీనియర్ నటుల బంధంపై కూడా కొన్ని నిజాలు బయటపడ్డాయి.

ఇంతకు ఆ నటులు ఎవరో కాదు.పవిత్ర, నరేష్.

వీరిద్దరూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటి నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే గత కొంతకాలం నుండి వీరి మధ్య ఏదో సంబంధం ఉందని బాగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

వీరు పెళ్లి చేసుకుంటారు అని కూడా గతంలో వార్తలు వినిపించాయి.కానీ ఇప్పటివరకు వాళ్ళు పెళ్లి కూడా చేసుకోలేదు.

కనీసం వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఎన్ని ప్రశ్నలు ఎదురైన కూడా వాళ్లు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.

ఇక వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్తుంటారు.మహాబలేశ్వరం టెంపుల్ లో కూడా కలిసి పూజలు చేశారు.

చాలామంది వీరిని ఇలా చూడటంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు అని అనుకున్నారు. """/" / కానీ తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో నటి పవిత్ర కొన్ని విషయాలు బయట పెట్టింది.

కర్ణాటక చెందిన ఓ కన్నడ న్యూస్ ఛానల్ తాజాగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

ఇక అదే ఛానల్ కు చెందిన ప్రతినిధి ఓ కన్సల్టెంట్ గా చెప్పుకొని స్టింగ్ ఆపరేషన్ చేశాడు.

ఇక అతడు పవిత్ర ను పలు ప్రశ్నలు అడిగాడు.అంతేకాకుండా అతడు నరేష్ పై ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించడంతో.

అది నిజమే అని తెలిపింది.కానీ అది తన వ్యక్తిగత విషయం అని.

దానిపై ప్రశ్నించే అర్హత ఎవరికి లేదు అని తెలిపింది.పైగా తాను, నరేష్ కలిసి ఉంటున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కూడా తెలుసని.

వారికే అభ్యంతరం లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకని ప్రశ్నించింది. """/" / ఆమె తన రిలేషన్ పే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.

నిజానికి ఈ స్టింగ్ ఆపరేషన్ ను నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు విషయంలో కొన్ని నిజాలు తెలుసుకోవటానికి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

కానీ అంతలోనే ఈ సంఘటన వల్ల కథ మొత్తం మలుపు తిరగటంతో అందరూ ఈ విషయం గురించి బాగా చర్చలు చేస్తున్నారు.

కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ విషయం గురించి బాగా హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ విషయం గురించి నరేష్ ఏమని స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

పురుషులు తలస్నానం చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ ను పాటిస్తే జుట్టు రాలమన్నా రాలదు!