తన తిక్కకు లెక్కలు చూపిస్తున్న గబ్బర్ సింగ్?

వారాహి మొదటి దశ యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ వేడిని రాజేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇప్పుడు దానిని పీక్ స్టేజి లోకి తీసుకెళ్లే ప్రయత్నం తన మల్లి విడత యాత్ర ద్వారా చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్థానానికి విలువ ఇచ్చానని చెప్పిన పవన్ ఇక ముఖ్యమంత్రిని ఏక వచనం తోనే పిలుస్తానని, ముఖ్యమంత్రి పీఠానికి ఉండే గౌరవాన్ని జగన్( CM Jagan ) దిగజార్చినందున తాను కూడా ఇక గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చేశారు .

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధికార వైసిపి పార్టీ ఏ స్థాయిలో దిగజార్చిందో కాగ్ రిపోర్ట్ సాక్ష్యంగా అంకెలతో సహా తేల్చేసిన జనసేనా ని దానిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉదాహరణలతో సహా చెప్పిన వైనం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఏ స్థాయిలో పట్టు సాధిస్తున్నారో అన్నది అర్థమవుతుంది.

ఒకప్పుడు కేవలం ఎమోషనల్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని రాజకీయాల్లో సీరియస్నెస్ లేదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కానీ ఆదాయ వ్యయాలపై కానీ సమగ్రమైన అధ్యయనం చేసినట్లుగా పవన్ కనబడటం లేదు అన్న విమర్శలకు తన ఏలూరు స్పీచ్ ద్వారా ఆయన చెక్ పెట్టినట్లే కనబడుతుంది.

తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారానని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన లీడర్కి ఉండవలసిన లక్షణాలను తాను అలవాటు చేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ కున్న బలాలు బలహీనతలపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళుతున్నాను అన్న సందేశాన్ని ఆయన ఏలూరు పర్యటన ద్వారా ఇచ్చేసారైనా చెప్పాలి.

"""/" / అంకెలు మీకు బోర్ కొట్టిస్తాయని చెబుతూనే దీనిని తెలుసుకోవలసిన అవసరం ఉందని ప్రజాస్వామ్యం అన్నది వేల మంది బలి ధానాలతో తెచ్చుకున్నదని, దీనిని కొంతమంది స్వార్థపరుల చేతికి వదిలేస్తే ఒక సంవత్సరంలోనే నాశనం చేసేస్తారని దీనికి బలమైన పహారా కాయాలంటూ ఆయన యువతకు సందేశాన్ని ఇచ్చారు.

ముఖ్యమంత్రి స్థానం అన్నది తాము కష్టంతో చేసిన పనుల నుండి వసూలు చేసిన పన్నులను ఖజానాకు మళ్ళించి దాని ధర్మాధికారిగా ముఖ్యమంత్రిని నియమించుకున్నామే తప్ప ఆయన మనకంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అంటూ తేల్చేశారు జనసేనా ని.

"""/" / ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి తన సొంత నిర్ణయాలతో ఇష్టానుసారం వ్యవహరిస్తానంటే కుదరదని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనని అయితే వేలకోట్ల బడ్జెట్ను ఇష్టానుసారం ఖర్చు పెడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తుందని ఈ విషయాన్నికాగ్ కూడా స్పష్టం చేసిందని 25 అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విఫలమైందని రిపోర్ట్ ఇచ్చింది అని కూడా జనసేనని( Jana Sena ) స్పష్టం చేశారు .

తన వారాహి యాత్ర ద్వారా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల సంక్షేమం పట్ల తాను ఎంత సిన్సియర్గా ఉన్నానో రాష్ట్ర అభివృద్ధి కోసం తానెంత సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానో చెప్పడం ద్వారా భవిష్యత్తు లీడర్ గా అవతరించేది నేనేనని కొత్త సంకేతాలు పవన్ పంపించినట్లు అయింది.

పానీపూరీ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. జస్ట్ ఇంత పే చేస్తే లైఫ్‌లాంగ్ పానీపూరీ ఫ్రీ.. ఎక్కడంటే?