బీజేపీ రూట్ కాదు సెపరేట్ ? పవన్ ప్లాన్ అదుర్స్

అందరూ వెళ్లే దారిలో వెళ్తే కిక్ ఏముంటుంది అన్నయ్యా ? మనకంటూ సేపరేటు రూట్ ఉంటుంది అన్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు కనిపిస్తోంది.

మొదటినుంచి ఆయన ఏ విధంగా రాజకీయాలు చేస్తూ వచ్చినా, చివరకి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత దగ్గర నుంచి ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటూ వస్తున్నారు.

బీజేపీ కనుసన్నల్లోనే తన ప్రయాణం అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.దీనిలో భాగంగానే కరుడుగట్టిన హిందువుగా పవన్ మారిపోయారు బీజేపీత కలిసి హిందుత్వ అజెండా ముందుకు తీసుకువెళ్లడం తో పాటు, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, తదితర విషయాలపై పెద్ద ఎత్తునే విమర్శలు చేశారు.

హిందూ దీక్షలు చేస్తూ, గుళ్ళు, గోపురాలు దర్శిస్తూ, వైసీపీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, హడావుడి గా పర్యటన లు చేస్తూ , జగన్ ను తిట్టి పోస్తూ వస్తున్నారు.

దీనికి తోడు పవన్ రహస్య మిత్రుడు గా పేరుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు సైతం పూర్తిగా హిందుత్వం అంశం మీద విమర్శలు చేస్తున్నారుు.

జగన్ క్రిస్టియన్ అని అందుకే హిందూ దేవాలయాల పైన హిందువుల పైన ఈ విధంగా పాల్పడుతున్నారని చంద్రబాబు పదేపదే విమర్శిస్తూ వచ్చారు.

"""/"/  ఇక ఇప్పుడు పవన్ వ్యవహారం మారిపోయింది.కేవలం హిందూ అజెండాగా ముందుకు వెళ్తే, ఏపీలో ప్రధానంగా ఉండే ముస్లిం, క్రిస్టియన్ వర్గాలు దూరమవుతాయని పవన్ ఆలస్యంగా గ్రహించారు.

ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా, ఆ మతాల ప్రజలు తమకు దూరమయ్యారనే లెక్కల్లో ఉన్న జనసేన ఇప్పుడు బీజేపీ రూట్లో వెళ్తే దెబ్బ తింటాము అనే ఉద్దేశంతో, హిందూత్వ అంశంపై వెనక్కి తగ్గుతోంది.

అందుకే అన్ని మతాలు ఒక్కటే అని, ఎవరి మతాలు వారికి ఉంటాయనే విషయన్ని పవన్ ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు.

పవన్ లో ఈ రకమైన మార్పు రావడానికి  కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.తమతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఎలాగూ  హిందువులకు దగ్గర అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అని, అదే రూట్లో వెళ్ళినా అదనంగా కలిసి వచ్చేది ఏమీ ఉండదు అనే అభిప్రాయానికి పవన్ వచ్చారట.

అందుకే  మిగిలిన మతాల వారిని చేజార్చుకోకుండా వారికి   అండగా నిలబడే విధంగా చేయడంతో పాటు,  వైసీపీకి ఆ వర్గాల ప్రజల ను దూరం చేయవచ్చు అనే ఉద్దేశంతో పవన్ ఉన్నారట.

ఆ వెలితి ఎప్పటికీ అలాగే ఉంటుంది…తారక్ కామెంట్స్ వైరల్!