ఉదాసీనత ముంచేస్తుంది పవన్ !

పార్టీపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని పట్టించుకోకుండా ఉదాసీన వైఖరి తో వ్యవహరిస్తున్న జనసేనాని వైఖరి పార్టీకి ఇబ్బందిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ముఖ్యంగా జనసేన తెలుగుదేశం కోసం పార్టీకోసం తన ప్రయోజనాలను తాకట్టుపేడుతుందని వస్తున్న వార్తలపై జనసేన పార్టీ ( Jana Sena )వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంది.

సరిగ్గా అదే పాయింట్ ను పట్టుకున్న అధికార వైసిపి పవన్ పై ముప్పేట దాడి చేస్తుంది.

"""/" / ఒకవైపు తెలంగాణ లో పోటీ చేసి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారన్న విమర్శలు ఇప్పటికే పార్టీని ఇబ్బంది పెడుతూ, ఉండగా శ్రీకాకుళం సభలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బందిగా మారింది.

అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో కూడా బాబు షూరిటీ పేరుతో ఉండటం ఇందులో పవన్ ప్రస్తావన లేకపోవడం కూడా జనసైనికులకు ప్రచార నిమిత్తం ఇబ్బందిగా మారిందని వార్తలు వస్తున్నాయి .

మరోపక్క తెలుగుదేశం( TDP )తో పొత్తు పది సంవత్సరాలు పాటు ఉండాలని పవన్ వ్యాఖ్యానించినట్లుగా జరుగుతున్న ప్రచారం కూడా నిజమో కాదో తెలియని పరిస్థితి.

"""/" / సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి రాకపోవడం అభ్యర్థుల్లో కూడా ఒకరకంగా అయోమయం నెలకొంది.

గత 10 సంవత్సరాలుగా పట్టుదలగా పార్టీని లాక్కువచ్చిన పవన్ ( PAWAN KALYAN )ఇప్పుడు కీలకమైన ఆఖరి సమయంలో పట్టు వదిలేస్తున్నారా అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

మరోపక్క అధికార పార్టీ చేసే విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టగలిగే నాయకుడు కూడా లేకపోవడం, పార్టీ తరుపున కీలకంగా వాయిస్ వినిపించిన కళ్యాణ్ దిలీప్ సుంకరలాంటి వ్యక్తిని పార్టీ దూరం చేసుకోవడంతో ఇప్పుడు పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించే మనుషులు కూడా కనిపించడం లేదు.

ఇట్లా జనసేన తెలుగుదేశానికి బీ పార్టీగా మిగిలిపోతే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా టిడిపికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది.

మరి జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని జనసేనా ని ఇప్పటికైనా తిప్పికొడతారో లేదో చూడాలి.

ఈ యాక్టర్స్ డబ్బింగ్ కూడా చెప్పారంటే ఎవరు నమ్మరు ..!