పవన్ ఆ ఒక్క మాటతో ... ! జనసేన పై ఎన్ని అనుమానాలో ?

సినీ హీరో ఇమేజ్ తో పాటు , బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నా, ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

2019 ఎన్నికల్లో పోటీ చేసినా,  కేవలం ఒకే ఒక్క స్థానాన్ని మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలిగింది.

అయినా  పవన్ అధైర్యపడకుండా బిజెపితో పొత్తు పెట్టుకుని జనసేన ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

బిజెపి తో వర్కవుట్ కాకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని , ఏదో రకంగా ఏపీలో అధికారంలోకి రావాలన్నది పవన్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే గత కొంత కాలంగా సినిమాలు వైపే మొగ్గు చూపిస్తున్నారు.వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు.

అలాగే కరోనా వైరస్ ప్రభావం మొదలయిన తరువాత ఆయన ఏపీలో అడుగు పెట్టలేదు.

కరోనా ప్రభావం తగ్గిన తరువాత మొదటిసారిగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయిన పవన్ ఈ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు జనసేన భవిష్యత్తు పై అనుమానాలు కలిగే విధంగా చేశాయి.

టిడిపి, వైసిపి పరిస్థితి ఏమిటో అందరికీ అర్ధం అయిపోవడంతో కొంతమంది నాయకులు చూపు జనసేనపై పడింది.

ఎప్పటికైనా జనసేన కు భవిష్యత్తు ఉంటుందనే నమ్మకంతో కొంతమంది ఇతర పార్టీల నాయకులు జనసేన వైపు చూస్తున్నారు.

అయితే తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేన వైపు వద్దాం అని చూస్తున్న నాయకుల్లో ఎన్నో అనుమానాలు పెంచడంతో పాటు, ఆ పార్టీ భవిష్యత్తు పై అనేక అనుమానాలు కలిగేలా చేశాయి.

"""/"/ పార్టీని నడపడం అంత ఈజీ కాదని , నిలబెట్టడం కూడా కష్టమే అంటూ పవన్ మాట్లాడడం పెద్ద సంచలనం సృష్టించింది.

ఈ వ్యాఖ్యల ద్వారా పవన్ జనసేన ను ముందుకు నడిపించే విషయంలో వెనకడుగు వేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పార్టీకి బలం లేకపోయినా, ప్రత్యర్థులను ఓడించగలమనే విధంగా మాట్లాడుతూ ఉంటేనే,  జనాల్లోనూ, పార్టీ నాయకులలోనూ కాస్తోకూస్తో ధీమా ఉంటుంది.

అలా కాకుండా స్వయంగా పార్టీ అధినేతే ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్న వారు, ఆ పార్టీలు చేరాలనుకునే వారికి ఇవన్నీ మరిన్ని అనుమానాలు పెంచడంతో పాటు చివరికి పార్టీ ఉనికినే ప్రశ్నర్ధకం చేస్తాయి అనడంలో సందేహమే లేదు.

దేవర హిందీ ప్రమోషన్ల కోసం టాప్ స్టార్లు.. యంగ్ టైగర్ ప్లాన్ వేరే లెవెల్ లో ఉండనుందా?