ముద్రగడ ను గౌరవించమంటున్న పవన్ కళ్యాణ్!?

తూర్పు గోదావరి జిల్లా లో వారాహి యాత్ర( Varahi Yatra ) చివరి రోజు మలికిపురం సభలో జరిగిన ఒక సంఘటన ఆసక్తిని కలిగించింది.

పవన్ కళ్యాణ్ పై విమర్శల లేఖాస్త్రాలు సంధించి సవాలు చేస్తున్న ముద్రగడ పై జనసేన నాయకులు వీర మహిళలు గత కొన్ని రోజులుగా విమర్శలు జడివాన కురిపిస్తున్న విషయం తెలిసిందే.

ఉబయ గోదావరి జిల్లాలో బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోవడానికి ముద్రగడ ను అస్త్రంగా వైసిపి వాడుతుందన్న ప్రచారం ఉంది .

కాపుల ఓట్లలో చీలిక తేవాలనే లక్ష్యంతో ముద్రగడను ప్రయోగిస్తున్నారని.అందువలనే పవన్ కళ్యాణ్ కనీస విమర్శలు చేయకపోయినా ముద్రగడ వైపు నుంచి రెండుసార్లు లేఖాస్తులు శందించారని విశ్లేషణలు ఉన్నాయి.

"""/" / అయితే ముద్రగడని వ్యతిరేకించి తిరిగి విమర్శలు చేస్తే వైసిపి ట్రాప్ లో పడినట్లుగా జనసేన ఉంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

ముద్రగడ ( Mudragada Padmanabham )పై పవన్ ఏదో ఒక సభలో విరుచుకుపడతారని దానికి కొనసాగింపుగా ముద్రగడ మరిన్నిలేఖాస్త్రాలు సంధిస్తారని, ముద్రగడకు మద్దతుగా కాపు కీలక నాయకులు, న్యూట్రల్ గా ఉండే నాయకులూ కూడా మీడియా ముందుకు వచ్చి పవను విమర్శిస్తారని తద్వారా కాపు సామాజిక వర్గంలో చీలిక కచ్చితంగా జరుగుతుందని ప్రచారాలు జరిగాయి.

మరి పవన్ ఈ విషయాన్ని గ్రహించారో లేక సహజంగానే ముద్రగడ పై అభిమానం ఉందో తెలియదు కానీ మల్కిపురం సభలో కుల ద్రోహి అని మన బ్యానర్లు చూపించిన కార్యకర్తల ను ఆయన సున్నితంగా హెచ్చరించి ఆ బ్యానర్లను తీసేయాల్సిందిగా సూచించారు.

"""/" / పెద్దలు ఏదో అంటుంటారు మనం తీసుకోవాలి అంటూ సున్నితంగా సూక్తులు కూడా చెప్పారు తద్వారా కాపుల మధ్య లో వైరం పెట్టివేడుక చూడాలనుకుంటున్న కొంతమంది వ్యూహాలకు చెక్ పెట్టేందుకే ఆయనలా ప్రవర్తించారని అంటున్నారు.

విమర్శలు ప్రతి విమర్శలు ద్వారా తన స్థాయిని తగ్గించాలని చూసిన కొంతమందికి సమాధానం ఇవ్వడానికే తన స్థాయి ఏమిటో ఆయన చూపించ డానికే అలా మాట్లాడాలని వార్తలు వస్తున్నాయి.

ఏది ఏమైనా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా తన పరిణితి చెందాడని ఈ వ్యాఖ్యల ద్వారా పవన్ నిరూపించుకున్నారు అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు మరి పవన్ వ్యాఖ్యలపై ముద్రగడ రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూడాలి .

పండ్ల తొక్కలతో మరింత అందంగా మెరిసిపోండిలా..!