నొప్పింపక తా నోవ్వక అంటున్న పవన్

భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) సారధ్యంలోని ఎన్డీఏ కూటమిలో ప్రస్తుతం తాము ఉన్నామో లేమో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిని జనసేన నేతలు కార్యకర్తలు ఎదుర్కుంటున్నారు .

ముఖ్యంగా పెడన సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యలు దాదాపు ఎన్డిఏ నుంచి బయటకు వచ్చామన్న రీతిలోనే ఉన్నాయి.

ఆయన ఒక సందర్భంలో ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అనే పదాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించారు.

అయితే పవన్కళ్యాణ్ కు ఆ ఉద్దేశమే లేదని, తాము ఇప్పటికి ఎన్డీఏలోనే భాగస్వాములుగా ఉన్నామంటూ తేల్చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ( Bolishetti Satyanarayana ).

పవన్ వ్యాఖ్యలు వక్రీకరించబడినవని తాము అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశంతో కలిసి ముందుకు నడుస్తున్నామే తప్ప దాని అర్థం ఎన్డిఏ ను వదులుకున్నట్టు కాదంటూ ఆయన సరికొత్త అర్ధాన్ని చెప్పారు.

"""/" / బలహీనంగా ఉన్న తెలుగుదేశాన్ని ఆదుకోవటం సాటి మిత్రపక్షంగా తమ ధర్మమని, ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే తాము టిడిపి తో జట్టు కట్టామని ఆయన తేల్చేశారు .

ఈరోజుకి ఎన్డిఏ తో కలిసి ముందుకు నడుస్తున్నామని, తెలుగుదేశం జనసేన( Janasena ) పొత్తుల లోకి భాజపా వస్తుందనే నమ్మకం తమ నాయకుడికి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు .

ఎటువంటి ఎన్నికలు లేని సమయంలో భాజపాతో పొత్తు పేట్టుకొని ఇప్పుడు కేంద్రం మద్దతు పూర్తిస్థాయిలో అవసరమైన పరిస్థితుల్లో బాజాపా తో తెగతెంపులు చేసుకోవడం జనసేనకు ఇష్టం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.

అయినప్పటికీ తామెంత ప్రయత్నించినా తెలుగుదేశంతో పొత్తుకు అడుగు ముందుకు వేయలేని భాజపాతో ఎలా కలిసి నడవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిని జనసేన నాయకత్వం ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది.

అయినప్పటికీ చివరిమజిలీ వరకు వేచి చూచే ధోరణి అవలంబించాలని ఏదో ఒక అద్భుతం జరిగితే భాజపా తమ కూటమి వైపు కదులుతుందనే ఆశలు జనసేన లో ఇంకా ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరి కాగల కార్యాన్ని తీర్చే ఆ గంధర్వులు ఎవరో చూడాలి .

2024 దీపావళి పండగ బ్లాక్ బస్టర్ హిట్ ఏది.. ఈ ప్రశ్నకు క్లారిటీ వచ్చేసిందిగా!