ఆ ఎన్నికల్లో బీజేపీ పోటీ ! పవన్ కే ఇబ్బంది ?

ఏపీలో ఏ రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్న తిరిగి అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బందులు తీసుకు వచ్చే విధంగా ఉన్నాయి.

ముఖ్యంగా జనసేన, బిజెపి తో పవన్ కు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి.ఏపీలో జనసేన తో పోల్చుకుంటే బీజేపీ బలం అంతంత మాత్రమే.

ఆ పార్టీతో పేరుకు పొత్తు తప్ప పెద్దగా ఉపయోగం లేదనేది జనసేన నాయకులు అభిప్రాయం .

అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో వివిధ రాజకీయ అవసరాల నిమిత్తం పవన్ పొత్తును కొనసాగిస్తున్నారు.

2024 ఎన్నికల సమయం నాటికి బీజేపీతో కలిసి నడిచే విషయంలో అందరికీ అనుమానాలు ఉన్నాయి.

  ఖచ్చితంగా పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే అభిప్రాయం అందరిలోనూ కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే .ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

      అయితే ఈ ఎన్నికలకు టిడిపి జనసేన పార్టీలు దూరంగా ఉండబోతున్న ట్లు గతంలో ప్రకటించాయి.

అయితే బీజేపీ మాత్రం ఇక్కడ తాము అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించింది .ఆ పార్టీ తరఫున బిజినవేముల రవీందర్ నాథ్ రెడ్డి బిజెపి గుర్తుపై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

అధికారికంగా త్వరలో ఆయన పేరును ప్రకటించేందుకు బిజెపి సిద్ధమవుతోంది.ఇదిలా ఉంటే ఇప్పుడు బిజెపి తమ అభ్యర్థి తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని అప్పుడే ఆ ఎన్నికల్లో పార్టీకి ఊపు వస్తుందని,  గెలుపు అవకాశాలు ఉంటాయని బలంగా నమ్ముతోంది .

పవన్ ను ప్రచారం దింపేందుకు ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయినట్లు సమాచారం.గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బిజెపి తరఫున అభ్యర్థి నిలబెట్టినా ప్రచారానికి పవన్ రాలేదు.

అంతేకాదు దివంగత నేత కుటుంబానికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో తాము పోటీ చేయబోమని పవన్ ప్రకటించారు.

      """/"/ మిత్రపక్షమైన బిజెపి అభ్యర్థి నిలబెట్టిన పవన్ ఆ కారణంతోనే దూరంగా ఉన్నారు .

ఇప్పుడు  ఆత్మకూరు ఉప ఎన్నికలు విషయంలోనూ అదే వైఖరితో పవన్ ఉన్నా.బీజేపీ మాత్రం పవన్ పై గట్టి ఒత్తిడి తీసుకురావాలని , అవసరమైతే కేంద్ర బిజెపి పెద్దల ద్వారా పవన్ ను ఒప్పించి ఎన్నికల ప్రచారానికి దింపాలి అనే ఆలోచనతో ఉండదట.

బాబు వల్ల అవ్వాతాతలకు పెన్షన్ కష్టాలు.. పండుటాకులను ఇంతలా ఇబ్బంది పెట్టాలా?