దుబ్బాక ఎన్నికల ప్రచారానికి పవన్ ?

దుబ్బాక ఎన్నికలు అన్ని పార్టీల్లో వేడి పెంచేస్తున్నాయి.అన్ని పార్టీలు ఇక్కడ గెలుపొందేందుకు గట్టిగానే కృషి చేస్తున్నాయి.

టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక్కడ గెలుపొందడం అన్ని పార్టీలకు అత్యవసరంగానే మారడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగానే ఉంది.

టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతను రంగంలోకి దించుతుండగా, బీజేపీ తరపున రఘనందరావు పోటీకి దిగుతున్నారు.

అలాగే కాంగ్రెస్ లో సేరియర్ పొలిటీషియన్ చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ కు అవకాశం దక్కకుండా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ గట్టిగానే హడావుడి చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఇక్కడ ఏదో ఒక రకంగా గెలవాలని చూస్తున్న బీజేపీ అగ్రనేతలను సైతం ఇక్కడ ప్రచారానికి దించే ఆలోచలో ఉందట.

ఇప్పటికే టీఆర్ఎస్ ను ఏదో ఒకరకంగా ఓడించాలనే కసితో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన మాటలతో టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నాడు.

ఇది ఇలా ఉండగానే ఈ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతోంది.

ప్రస్తుతం పవన్ ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆయనను ఈ ఉప ఎన్నికల ప్రచారానికి దించే ఆలోచనలో ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి.

"""/"/ ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పవన్ తో ప్రచారం చేయించాలనే ఆశలో బీజేపీ ఉండడం, ఇప్పటికే పవన్ అక్కడ ప్రచారానికి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుండడంతో, దుబ్బాకలోనూ బీజేపీ అభ్యర్థి తరపున రంగంలోకి దిగేందుకు పవన్ సిద్ధం అవుతున్నట్టుగా ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది.

అయితే ఈ విషయం పై జనసేన నుంచి ఏ క్లారిటీ రాకపోవడంతో ఇది నిజామా ఊహాగానమా అనే సందిగ్ధత ఏర్పడింది.

గాయాన్ని మొక్కతో నయం చేసుకుంటున్న ఒరంగుటాన్.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు..