ఢిల్లీకి పవన్ ! రాజకీయం చాలా ఉందా ?
TeluguStop.com
కొంతకాలంగా ఏపీలో తన మార్కు రాజకీయం చూపిస్తూ హడావుడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై అలుపెరగకుండా పోరాటాలు చేస్తున్నారు.
నిత్యం ఏదో ఒక అంశం మీద ప్రజా పోరాటం చేస్తూ అధికార పార్టీని ఇబ్బందిపెడుతున్నాడు.
అంతే కాదు ఏపీలో బర్నింగ్ ఇష్యు గా మారిన ఇసుక విషయంలో తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకున్నారు.
ఆ తరువాత తెలుగుదేశం పార్టీ చేపట్టిన దీక్షకు పవన్ మద్దతు తెలిపారు.ఇవన్నీ టిడిపి, జనసేన పొత్తుపై అనేక ఊహాగానాలు లేవదీసాయి.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే ఆకస్మాత్తుగా పవన్ ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర బిజెపి పెద్దలను కలిసేందుకు అనే వార్తలు వినపడుతున్నాయి.
ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ , అమిత్ షా లను కలిసి ఏపీ రాజకీయాల గురించి క్షుణ్ణంగా చర్చించే అవకాశం ఉన్నట్టు గా తెలుస్తోంది.
దీంతో పవన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇక ఈ విషయంలో లో వైసీపీ కూడా అప్పుడే విమర్శలు మొదలు పెట్టింది వైసీపీ.
ఈ మేరకు వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పవన్ ను ఉద్దేశించి అనేక ప్రశ్నలు సంధించారు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి వెళ్ళింది కేవలం చంద్రబాబు దూతగానేనని, టీడీపీతో పొత్తు విషయంలో బిజెపి వెనకడుగు వేస్తుంది అందుకే పవన్ ఆ బాధ్యతలు తీసుకున్నారని ఆయన విమర్శించారు.
అలాగే జగన్ ను విమర్శించేందుకు పవన్ ప్యాకేజీలు తీసుకుంటూ సరికొత్త రాజకీయాలకు పదునుపెట్టాడని రాంబాబు విమర్శలు చేశారు.
అయితే జనసేన వర్గాలు మాత్రం ఏపీలో ఇసుక కొరత కారణంగా కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరేందుకే పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు అంటూ చెప్పుకొస్తున్నాయి.
ఫ్లాపైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారా?