ఒక పక్క పవన్ – మరో పక్కబాబు టైమింగ్ అదుర్స్ !
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తన వారాహి యాత్ర( Varahi Yatra )తో పొలిటికల్ హీట్ పెంచేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు భీమవరం వేదికగా జరిగే బహిరంగ సభతో తన తొలి విడత వారాహి యాత్రకు బ్రేక్ వెయ్యనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ఈ లోపే తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్టులన్ని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్న పవన్ అటు రాజకీయాలని ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు .
గత కొంతకాలంగా ఫుల్ టైం రాజకీయాలకు సమయం కేటాయించిన పవన్ వారాహి రెండవ దశ యాత్రకు కొంత సమయం ఇచ్చి సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
"""/" / తనకు సినిమాలు మాత్రమే ఆదాయ మార్గమని చెప్పిన పవన్( Pawan Kalyan ) ఆ డబ్బునే తీసుకొచ్చి రాజకీయాలలో ఖర్చుపెడుతున్నానని ఇంతకుముందే చెప్పుకొచ్చారు .
ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు కూడా ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి షూటింగ్ లు చేస్తూ డబ్బింగ్ లు చెప్పించుకుంటున్నారు .
ఒక పక్క మొదటి దశ వారహయాత్రకు పవన్ బ్రేక్ ఇస్తుంటే మరోపక్క తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తన జిల్లాల యాత్రను మొదలుపెట్టబోతున్నారట.
"""/" / ఎవరికి వారే తామే ముఖ్యమంత్రి అభ్యర్థులుమని ఈ ఇరుపార్టీల అధ్యక్షులు చెప్పుకుంటున్నప్పటికీ జగన్ ని( CM Jagan ) గద్దె దించే విషయంలో మాత్రం వీరు పూర్తిస్థాయి అవగాహనతో ఉన్నారని ప్రజల సమస్యలు పై ఒకరు నిలదీస్తూ ఉంటే, మరొకరు వేచి చూచే ధోరణి అవలంబించాలని నిర్ణయించుకున్నందునే, పవన్ యాత్రకు అడ్డు రాకుండా ఇంతకాలం చంద్రబాబు వెయిట్ చేశారని, ఇప్పుడు పవన్ యాత్ర పూర్తికాగానే చంద్రబాబు మొదలు పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి వచ్చే ఎన్నికల వరకు నిరంతరం అధికార పార్టీ విధానాలను ప్రజల్లో ప్రశ్నించే విధంగా ఈ రెండు పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి .
తమ అధ్యక్షుల తీరు ని గమనిస్తున్న ఈ రెండు పార్టీల కార్యకర్తలు కూడా వాటే టైమింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.