ఏలినాటి శని తొలగిపోవాలంటే.. పావగడ శనీశ్వరాలయం సందర్శించాల్సిందే..!

ఎంతో మంది దేవతలలో శనీశ్వరుడు ఒకరు.చాలామంది శని అంటే ఒక కీడు, అపశకునం, ఒక దోషమని భావిస్తారు.

నిజానికి శనీశ్వరుడు భక్తులకు కోరిన కోరికలను తీర్చే దేవుడు మాత్రమే కాకుండా మనం చేసిన తప్పులకు శని ప్రభావం మనపై చూపెడుతూ అనేక కష్టాలకు గురి చేస్తుంటాడు.

అయితే మన పై ఏర్పడిన శని ప్రభావం తొలిగిపోవడానికి శనీశ్వరాలయాన్ని సందర్శించి శని ప్రభావాన్ని తొలగించుకోవచ్చు.

ఈ విధంగా శనీశ్వరుడి ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి.ఇలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి పావగడలో వెలిసిన శనీశ్వరాలయం ఎంతో ప్రసిద్ధిచెందినది.

పావగడలో వెలసిన శనీశ్వరుని ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు వందల మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు.

ఈ ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుందని వారి పై ఏర్పడిన శని ప్రభావం తొలిగిపోయి పనులు, కార్యక్రమాలు నెరవేరతాయని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే ఈ ఆలయాన్ని దర్శనం కోసం కర్ణాటక వాసులే కాకుండా అనంతపురం జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున పావగడ శనీశ్వరుని ఆలయానికి చేరుకుంటారు.

"""/" / పూర్వం ఈ ఆలయంలో శనీశ్వరుని విగ్రహానికి బదులుగా అమ్మవారి విగ్రహం కొలువై ఉండి భక్తులను దర్శనమిచ్చేది.

ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి పూజలు చేయటం వల్ల ఆ ప్రాంతం ఏ విధమైనటువంటి కరువుకాటకాలు లేకుండా సుభిక్షంగా ఉందని భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించేవారు.

అయితే కొన్ని సంవత్సరాల అనంతరం అమ్మవారి పక్కన శనీశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని భావించిన ప్రజలు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు.

అప్పటివరకు అమ్మవారి ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం రానురాను శనీశ్వరుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఎవరిపై అయితే శని ప్రభావం అధికంగా ఉంటుందో అలాంటి భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారికి తలనీలాలు సమర్పించడం.

నిలువుదోపిడి ఇవ్వడం వంటివి చేసి వారి పై ఉన్నటువంటి శని ప్రభావం దోషం తొలగిపోవాలని స్వామి వారికి నమస్కరిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ క్రమంలోనే ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్20, ఆదివారం 2024