తప్పు తనదే- ఒప్పుకున్న పవార్!

అధికార వ్యామోహం అన్నది ఒక పట్టాన ఎవరిని వదిలిపెట్టదు.ముఖ్యంగా రాజకీయ( Political ) రంగంలో,ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఈ రంగం లో తన అధికారాన్ని వదలుకోవడానికి ఎవరూ ఇష్టపడరు.

జీవితాంతం తమకు బజన చేసే వాళ్ళు , ఎమ్ కావాలన్నా క్షణాల్లో చేసిపెట్టే అదికార గణం , కోట్ల రూపాయల సంపాదించుకునే అవకాశం తీసుకొచ్చి పెట్టె రాజకీయ అధికారాన్ని వదులుకోవడానికి ఎవరికి మనసు రాదు .

అయితే దశాబ్దాల పాటు అవన్నీ అనుబవించిన తర్వాత తమ వయసుని , శారీరక స్థితి ని గుర్తించి కొత్త తరానికి దారి ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది అని విజ్ఞులు గుర్తిస్తారు .

ఆ విషయాన్ని గుర్తించలేకే తన పార్టీ ని నిధువు నా చీల్చుకున్నానని ఇప్పుడు రోధిస్తున్నారట మహారాష్ట్ర ఎన్సిపి చీఫ్ శరద్ పవార్( Maharashtra NCP Chief Sharad Pawar ) .

"""/" / 84 సంవత్సరాల ముదిమి వయసులో కూడా ఇంకా పార్టీపై తన పెత్తనమే ఉండాలని భావించిన ఆయన అత్యాశే నేడు పార్టీ ఎదుర్కుంటున్న దుస్థితి కి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.

ఆయన పెద్దరికంని గౌరవించిన పార్టీ సభ్యులు ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోతానంటే అభ్యంతరం చెప్పారు .

అయితే వారికి నచ్చచెప్పి ఒప్పించాల్సింది పోయి తగుదునమ్మా అని తిరిగి తననే అధ్యక్షుడిగా ప్రకటించుకొని, కనీసం తన తర్వాతి స్థానాన్ని అయినా మేనల్లుడు అయ్యే అజిత్కు అప్పచెప్పి ఉండి ఉంటే ఈరోజు ఈ తిరుగుబాటు జరిగి ఉండేది కాదన్న రాజకీయ విశ్లేషకుల అంచనాల లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ఒక పక్క అధ్యక్షుడు గా తాను ఉంటూ తర్వాత స్థానాన్ని కూడా తన కుమార్తెకి కట్టబెట్టిన శరద్ పవార్, దశాబ్దాల తరబడి పార్టీ పై పట్టు పెంచుకుంటూ , అధ్యక్ష స్థానం కోసం ఓపికగా ఎదురుచూస్తున్న అజిత్ లో తిరుగుబాటుదొరణి కి ఆద్యం పోసాడని చెప్పవచ్చు.

"""/" / పరిస్థితులన్నీ చెయ్యి దాటిపోయి ఇప్పడిక చేయడానికి ఏమీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు తత్వం బోధపడినట్లుగా ఉంది.

పెద్దలు చెప్పిన” క్షవరం అయితే గాని వివరం రాదు” అన్న సామెత లాగ ఇప్పడిక తాను తిప్పాల్సిన చక్రాలు ఏమీ లేకపోవడంతో ఆయనకు జ్ఞానోదయం అయినట్టుగా ఉంది.

ఇప్పుడు తీరిగ్గా పార్టీ కార్యకర్తల సమావేశంలో “జరిగిన ఈ పరిణామాలకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నానని, దీనికి ఎవరిని బాధ్యుడిని చేయడం తనకి ఇష్టం లేదని ప్రకటించారు.

ఆయనకి ఈ జ్ఞానోదయం ఏదోముందే కలిగి ఉంటే పార్టీ కింత దుస్థితి రాకపోయి ఉండేది కదా అని ఎన్సిపి హార్డ్ కోర్ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారట .

బవ బందాలను అవసరమయిన సమయం లో వదులుకోలేక పోతే పరిణామాలకు శరద్ పవార్ ఉదంతం ఒక సాక్షి భూతం గా నిలుస్తుంది అని చెప్పవచ్చు .

నా పెళ్లిలో ఆ హీరో గుక్క పట్టి ఏడ్చాడు.. ఖుష్బూ చెప్పిన విషయాలకు షాకవ్వాల్సిందే!