సినిమాల కోసం పెళ్లికి దూరంగా ఉన్న.. ఆ గొప్ప నటుడు గురించి మీకు తెలుసా?
TeluguStop.com
సినిమా అంటే కేవలం మేకప్ వేసుకుని నాలుగు డైలాగులు చెప్పడం అని అనుకుంటారు చాలా మంది.
కానీ నటన అంటే ప్రాణంతో సమానం అని భావించిన వారు చాలా మంది ఉన్నారు.
వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి నటనే ప్రాణంగా బ్రతికి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసిన వారు ఉన్నారు.
ఇక ఇలాంటి వారిలో రచయిత పింగళి నాగేంద్ర రావుతో పాటు ఆర్టిస్ట్ పాల్ దొరస్వామి ఒకరు.
ఈయన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి పెళ్లికి దూరంగా ఉండటమే కాదు తన పూర్తి జీవితాన్ని ఇక చిత్ర పరిశ్రమకే అంకితం చేశారు.
అప్పట్లో ఆర్టిస్ట్ పాల్ దొరస్వామి అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది.అయితే ఈయన నేటి తరం ప్రేక్షకులకు తెలియక పోయినా ఇక చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది సీనియర్లు ఇక ఈయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను మాత్రం గుర్తు చేసుకుంటూ ఉంటారు.
వందేమాతరం, సుమంగళీ లాంటి చిత్రాలలో హీరో తండ్రి పాత్రలో నటించి తన నటనతో పాత్రకు ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
పాల్ దొరస్వామి ఇక ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే వారు ఆయన.
కేవలం హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో మాత్రమే కాదు విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించారు.
"""/" /
వందేమాతరం, సుమంగళీ లాంటి చిత్రాలలో హీరో తండ్రిగా నటించిన ఆయన.
మల్లేశ్వరి సినిమాలో మల్లేశ్వరి తండ్రిగా కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.పెళ్లి చేసి చూడు చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉండే గోవిందయ్య పాత్రలో నటించి తన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఒకప్పుడు వేషాలు కావాలి అని తిరిగిన స్థాయి నుంచి దర్శక నిర్మాతలు ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసుకునే స్థాయికి ఎదిగారు పాల్ దొరస్వామి.
"""/" /
సహజ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు.
సినిమాల కోసం పెళ్లికి దూరంగా ఉంటూ సినిమాలకే నా జీవితం అంకితం అంటూ బ్రతికారు ఆయన.
ఇంతటి గొప్ప నటుడు పాల్ దొరస్వామి గురించి నేటి తరం ప్రేక్షకులు కూడా ఎంతో బెటర్.
కొలెస్ట్రాల్ ను తగ్గించే లెమన్ గ్రాస్.. ఇంతకీ ఎలా తీసుకోవాలి..?