అభయాంజనేయస్వామికి పట్టాభి రామ్ పూజలు

ఘన స్వాగతం పలికిన సాయి కల్యాణి, గోపాలకృష్ణ, టీడీపీ నేతలు హనుమాన్ జంక్షన్, అక్టోబరు 23: బెయిల్ పొందిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ హనుమాన్ జంక్షన్​లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

★ రాజమహేంద్రవరం నుంచి వెళ్తూ హనుమాన్ జంక్షన్ లో తొలుత తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, మచిలీపట్నం పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆళ్ల గోపాలకృష్ణ, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

★ అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.★ స్వాగతం పలికిన వారిలో బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, బాపులపాడు టౌన్ ప్రెసిడెంట్ అట్లూరి శ్రీనివాసరావు, తెలుగు మహిళ ఏలూరు పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు వడ్డీ వేసవి, టీడీపీ నాయకులు సురపనేని రంగారావు, దేవినేని అవినాష్.

తదితరులు ఉన్నారు.★ పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు నియజకవర్గం, అప్పనవీడు, ఈపురు గ్రామాలు నుంచి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు.

చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…