టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తకు కూడా పదవులు దక్కుతాయని, అందుకు నిలువెత్తు నిదర్శనం తానేనని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

పార్టీ ఈ అవకాశం వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లడుతూ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను రుణపడి ఉంటానని,ఈ అవకాశం వచ్చేందుకు సహకరించిన మంత్రులు ఉత్తమ్,కోమటిరెడ్డి, సీతక్క,పార్టీ నేత వేంనరేందర్ రెడ్డి,పార్టీ రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నాపై నమ్మకంతో సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్రంతో పాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

సూర్యాపేట జిల్లాను పర్యాటక రంగంగా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ప్రత్యేక నిధులు తెచ్చి,జిల్లాలోని పిల్లలమర్రి,ఉండ్రుగొండ, నాగుల పహాడ్,సద్దుల చెరువు వంటి ప్రముఖ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు.

ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తనవంతు కృషి చేస్తానని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విజయవంతమైందని, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి మెజార్టీ స్థానాలు గెలిచెలా చూస్తామన్నారు.

ఎమ్మేల్యే, ఎంపి అభ్యర్ధిగా అవకాశం అందకపోయినా ఎట్టకేలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో ఇప్పటికైనా గుర్తించి పార్టీ ఒక సముచిత స్థానం కల్పించిందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

దటీజ్ రామ్ చరణ్.. 500 మంది కోసం చరణ్ ఉపాసన చేసిన పనికి వావ్ అనాల్సిందే!