రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశాడు: పటేల్ రమేష్ రెడ్డి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని,సూర్యాపేట నియోజకవర్గంలో గడప గడపకు తిరిగి మంత్రి జగదీష్ రెడ్డి పాలనను,కాంగ్రెస్ విధానాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేశానని,టిక్కెట్ ఇస్తామని, వెళ్ళి నియోజకవర్గంలో మీ పని చేసుకోండని చెప్పి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు అన్యాయం చేశారని పేట కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి శుక్రవారం కంటతడి పెట్టుకున్నారు.
జిల్లా కేంద్రంలోని తననివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏం జరిగిందో తెలియదని,దీని వెనుక ఎవరి హస్తముందో కానీ,మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపించడం కోసమే దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు.
సూర్యాపేట నియోజకవర్గ ప్రజల మద్దతు తనకే ఉందని, ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
దీనితో సూర్యాపేటలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవాస భారతీయుల నుంచి డబ్బే డబ్బే .. 2024లో భారత్‌కు ఎంత వచ్చిందంటే?